ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోనాలి ఠక్కర్‌ను భారత్‌కు రప్పించండంటూ.. ప్రధాని మోదీకి లేఖ

ABN, First Publish Date - 2020-02-22T20:34:56+05:30

చైనాలో కరోనా(కొవిడ్-19) వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ వైరస్ బారిన పడి చైనాలో ఇప్పటికే 2,345 మంది మృతి చెంద

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: చైనాలో కరోనా(కొవిడ్-19) వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ వైరస్ బారిన పడి చైనాలో ఇప్పటికే 2,345 మంది మృతి చెందగా.. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 76,288 మంది దీని బారిన పడ్డారు. ఇదిలా ఉంటే.. జపాన్ డైమండ్ ప్రిన్సెస్ నౌకలో ఉన్న భారతీయుల  పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. ఈ నౌకలో మొత్తం 3,711 మంది ఉండగా.. అందులో 138 మంది భారతీయులున్నారు. ఈ 138 మందిలో ఎనిమిది మందికి కరోనా వైరస్ సోకింది. ఈ నేపథ్యంలో తన కూతురును త్వరగా భారత్‌కు రప్పించాలంటూ ప్రధాని మోదీకి ఓ వ్యక్తి లేఖ రాశారు. మహారాష్ట్రకు చెందిన దినేష్ ఠక్కర్.. తన కూతురు సోనాలి ఠక్కర్ (24) డైమండ్ ప్రిన్సెస్ నౌకలో పని చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తన కూతురు కరోనా వైరస్ బారినపడలేదనీ.. వైద్య పరీక్షల్లో కూడా ఈ విషయం స్పష్టం అయిందన్నారు. తన కూతురు గత 15 రోజులుగా నౌకలోని చిన్న గదిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని తన కూతురుని భారత్‌కు రప్పించాలని లేఖలో కోరారు. కాగా.. డైమండ్ ప్రిన్సెస్ నౌకలో నెలకొన్న భయాందోళన పరిస్థితులను వివరిస్తూ వినయ్ కుమార్ సర్కార్ అనే యువకుడు సోషల్ మీడియాలో ఇప్పటికే ఓ వీడియో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.


Updated Date - 2020-02-22T20:34:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising