ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎయిరిండియా విమాన ప్ర‌మాదం: గ‌ర్భిణీ ప్రాణాలు కాపాడిన ఫిట్‌నెస్ స‌ర్టిఫికేట్ !

ABN, First Publish Date - 2020-08-09T15:01:07+05:30

దుబాయ్ నుంచి వ‌చ్చిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం శుక్ర‌వారం రాత్రి కోజికోడ్‌లో ప్ర‌మాదానికి గురై రెండు ముక్క‌లైన విష‌యం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షార్జా: దుబాయ్ నుంచి వ‌చ్చిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం శుక్ర‌వారం రాత్రి కోజికోడ్‌లో ప్ర‌మాదానికి గురై రెండు ముక్క‌లైన విష‌యం తెలిసిందే. 184 మంది ప్ర‌యాణికులు, ఏడుగురు సిబ్బందితో‌ వ‌చ్చిన ఈ విమానంలో ఇద్ద‌రు పైలెట్ల‌తో క‌లిపి 20 మంది వ‌ర‌కు మ‌ర‌ణించగా... ప‌లువురు గాయాల‌పాల‌య్యారు. దీంతో ప్ర‌మాదం జ‌రిగిన ప్రాంతం క్ష‌త‌గాత్రుల రోద‌న‌ల‌తో నిండిపోయింది. ఇదిలా ఉంటే... షార్జాలో ఉండే ఓ గ‌ర్భిణీ కూడా ఇదే విమానంలో రావాల్సి ఉండ‌గా... చివ‌రి నిమిషంలో ఆమె ఫిట్‌నెస్ స‌ర్టిఫికేట్ తీసుకోవ‌డంలో జాప్యం జ‌రిగింది. అదే ఆమె ప్రాణాలు కాపాడింది.


వివ‌రాల్లోకి వెళ్తే... ఇజాజ్ ఉమ‌ర్‌, జ‌స్లీనా దంప‌తులు షార్జాలో నివాస‌ముంటారు. జ‌స్లీనా ప్ర‌స్తుతం ఏడు నెల‌ల గ‌ర్భిణీ. దీంతో భార్య‌ను స్వ‌దేశానికి పంపించేందుకు ఉమ‌ర్ ఏర్పాటు చేశాడు. శుక్ర‌వారం దుబాయ్ నుంచి వ‌చ్చిన ఎయిరిండియా విమానంలో ఆమెకు టికెట్ బుక్ చేశాడు. అయితే, ఆమెకు ఫిట్‌నెస్ స‌ర్టిఫికేట్ రావ‌డం ఆల‌స్య‌మైంది. దాంతో చివ‌రి నిమిషంలో ఉమర్ టికెట్ క్యాన్సిల్ చేసుకుని ఆదివారానికి బుక్ చేసుకున్నాడు. ఇలా ఫిట్‌నెస్ స‌ర్టిఫికేట్ జాప్య‌మే ఇప్పుడు జ‌స్లీనా ప్రాణాలు కాపాడింది. లేకుంటే తాను కూడా ప్ర‌మాదానికి గురైన ఇదే విమానంలో వ‌చ్చి ఉంటే... ఏం జ‌రిగి ఉండేదో ఊహించుకుంటేనే భ‌య‌మేస్తుంద‌ని జ‌స్లీనా తెలిపింది. దేవుడే మా పాలిట ర‌క్షగా నిల‌బ‌డ్డాడ‌ని... అందుకే చివ‌రి నిమిషంలో మ‌మ్మ‌ల్ని ఇలా త‌ప్పించాడ‌ని దంప‌తులు అన్నారు. గ్రేట్ ఎస్కేప్ అంటూ భ‌గ‌వంతుడికి ధ‌న్య‌వాదాలు చెబుతున్నారు.

Updated Date - 2020-08-09T15:01:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising