దుబాయిలో భారత వ్యాపారవేత్త ఆత్మహత్య.. దర్వాప్తు చేయగా..
ABN, First Publish Date - 2020-04-30T15:54:41+05:30
భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జాయ్ అరక్కల్ ఇటీవల దుబాయిలో
దుబాయి: భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జాయ్ అరక్కల్ ఇటీవల దుబాయిలో మరణించారు. ఈ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆయనది ఆత్మహత్యేనని నిర్థారించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏప్రిల్ 23వ తేదీన జాయ్ తన అపార్ట్‌మెంట్‌లోని 14వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకునే సమయంలో ఆయన ఇంట్లో ఓ స్నేహితుడు, అతడి కొడుకు ఉన్నట్టు అధికారులు తెలుసుకున్నారు. సిగరెట్ తాగుతానంటూ బాల్కనీలోకి వెళ్లిన జాయ్.. అక్కడి నుంచి దూకేసినట్టు అధికారులు తెలిపారు. కాగా.. జాయ్ కేరళకు చెందిన వారని, ఇన్నోవా రిఫైనింగ్ అండ్ ట్రేడింగ్ ఎఫ్‌జెడ్‌ఈ అనే కంపెనీని నడుపుతున్నట్టు అధికారులు చెప్పారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా గతేడాది యూఏఈ ప్రభుత్వం ఆయనకు పదేళ్ల గోల్డ్ కార్డ్ వీసాను కూడా ఇచ్చినట్టు తెలిపారు. జాయ్ మృతదేహాన్ని భారత్‌కు తీసుకెళ్లేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేకంగా చార్టర్డ్ ఎయిర్ అంబులెన్స్‌ను ఏర్పాటు చేసిందని అధికారులు చెప్పారు.
Updated Date - 2020-04-30T15:54:41+05:30 IST