ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌ బేఖాతరు.. ప్రపంచదేశాల్లో కిక్కిరిసిన ఈద్గాలు, మసీదులు

ABN, First Publish Date - 2020-05-26T02:17:57+05:30

కరోనా వెంటాడుతున్నా.. లాక్‌డౌన్ ఆంక్షలు విధించినా.. పలు దేశాల్లో రంజాన్ ప్రార్థనల కోసం మసీదుల్లో జనం కిక్కిరిసారు. కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ నే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా వెంటాడుతున్నా.. లాక్‌డౌన్ ఆంక్షలు విధించినా.. పలు దేశాల్లో రంజాన్ ప్రార్థనల కోసం మసీదుల్లో జనం కిక్కిరిసారు. కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ యేడాది ఈద్‌ ప్రత్యేక ప్రార్థనలు ఈద్గాలు, మసీదులలో కాకుండా ఇళ్లల్లోనే జరుపుకోవాలని అనేక మంది సూచించారు. అయినప్పటికి పలు దేశాల్లో కనీసం భౌతికదూరం కూడా పాటించకుండా వేలాది మంది ముస్లింలు మసీదుల్లో గుమిగూడారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియాలలో రంజాన్ ప్రార్థనల కోసం ముస్లిం మతస్థులు పెద్ద సంఖ్యలో మసీదులకు హాజరయ్యారు. కొన్ని మసీదుల్లో కనీసం ఫేస్ మాస్క్ లేకుండానే నమాజ్‌లో పాల్గొన్నారు. మరికొన్ని మసీదులు ముస్లింలు మసీదుల్లోకి వెళ్లే ముందు శానిటైజర్‌ రాసి పంపుతున్నారు. రంజాన్ మాసం మొదలైన నాటి నుంచే అనేక ముస్లిం దేశాలు లాక్‌డౌన్‌లో సడలింపులిస్తూ వచ్చాయి. అయితే వేలాది మంది ఒకేచోట ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా గుమిగూడటం వల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-05-26T02:17:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising