ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రెజిల్‌లో గడిచిన 24 గంటల్లో 20 వేలకు పైగా కేసులు

ABN, First Publish Date - 2020-07-07T22:12:00+05:30

బ్రెజిల్‌లో గడిచిన 24 గంటల్లో 20,229 కరోనా కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రసిలియా: బ్రెజిల్‌లో గడిచిన 24 గంటల్లో 20,229 కరోనా కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. అంతకుముందు రోజు నమోదైన 26 వేల కేసులతో పోల్చితే ఈ సంఖ్య తక్కువగానే ఉంది. మరోపక్క గడిచిన 24 గంటల్లో బ్రెజిల్ వ్యాప్తంగా కరోనా కారణంగా 620 మంది మృత్యువాతపడ్డారు. అంతకుముందు రోజు కరోనా బారిన పడి 602 మంది మరణించినట్టు ఆరోగ్యశాఖ పేర్కొంది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 16,23,284కు చేరగా.. మరణాల సంఖ్య 65,487కు చేరింది. ఇక కరోనా నుంచి ఇప్పటివరకు మొత్తంగా 9,27,292 మంది పూర్తిగా కోలుకున్నట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో అమెరికా నిలవగా.. ఆ తరువాతి స్థానాల్లో బ్రెజిల్, ఇండియా, రష్యా, పెరు దేశాలు ఉన్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కోటి 17 లక్షల 69 వేల 250 కేసులు నమోదుకాగా.. 5,41,487 మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 20 నుంచి 30 శాతం కేసులు ఒక్క అమెరికాలోనే నమోదు కావడం గమనార్హం. అమెరికాలో ఇప్పటిరకు దాదాపు 30 లక్షలు కేసులు నమోదయ్యాయి. 

Updated Date - 2020-07-07T22:12:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising