ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దక్షిణ కొరియాలో.. డిశ్చార్జ్‌ అయిన వారికీ పాజిటివ్!

ABN, First Publish Date - 2020-04-10T09:25:19+05:30

రోజులు గడిచేకొద్దీ కరోనా వైరస్ గురించి కొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మహమ్మారి వల్ల వృద్ధులకే ముప్పు అనే వాదనలు గతంలో వినిపించాయి. అయితే తాజా పరిశోధనల్లో మాత్రం.. యువకులు, మధ్య వయసు వారే అధికం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రోజులు గడిచేకొద్దీ కరోనా వైరస్ గురించి కొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మహమ్మారి వల్ల వృద్ధులకే ముప్పు అనే వాదనలు గతంలో వినిపించాయి. అయితే తాజా పరిశోధనల్లో మాత్రం.. యువకులు, మధ్య వయసు వారే అధికంగా కరోనా కాటుకు బలవుతున్నారని తేలింది. ఈ నేపథ్యంలో మహమ్మారి నుంచి బయటపడ్డ వారికి.. వైరస్ మళ్లీ తిరగబెట్టే అవకశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ విషయంలో దక్షిణ కొరియాకు చెందిన సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) స్పష్టత ఇచ్చింది. కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన సుమారు 51 మంది పేషెంట్లకు తిరిగి పరీక్ష చేస్తే.. పాజిటివ్ వచ్చినట్లు సీడీసీ డైరెక్టర్ జనరల్ జియాంగ్ యన్‌కియాంగ్ తెలిపారు. అయితే ఈ విషయంలో పూర్తిలో స్థాయిలో అధ్యయనం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా చైనాలో కూడా ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నట్లు ఆయన వివరించారు. కాగా.. దక్షిణ కొరియాలో ఇప్పటి వరకు 10,384 మంది వైరస్ బారినపడగా.. 6,776 మంది కోలుకున్నారు. 


Updated Date - 2020-04-10T09:25:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising