ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క‌రోనాకు వ్యాక్సీన్‌ అవ‌స‌రం లేదు: ట్రంప్‌

ABN, First Publish Date - 2020-05-09T23:12:18+05:30

అగ్ర‌రాజ్యం అమెరికాను మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ అతలాకుత‌లం చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్ట‌న్ డీసీ: అగ్ర‌రాజ్యం అమెరికాను మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ అతలాకుత‌లం చేస్తోంది. రోజురోజుకు శ‌ర‌వేగంగా విస్త‌రిస్తున్న ఈ వైర‌స్ వ‌ల్ల ప్ర‌తిరోజు వేల సంఖ్య‌లో పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు న‌మోదవుతున్నాయి. దీంతో అమెరిక‌న్ల‌కు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఇదిలాఉంటే తాజాగా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోసారి 'కొవిడ్‌-19' విష‌య‌మై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. క‌రోనాకు ఎలాంటి వ్యాక్సీన్‌ అవ‌స‌రం లేదన్నారు. అంతేగాక త‌న అంచ‌నా ప్ర‌కారం దేశవ్యాప్తంగా 95 వేల వ‌ర‌కు మ‌ర‌ణాలు న‌మోదు కావొచ్చ‌ని అన్నారు. రిప‌బ్లిక‌న్ పార్టీ నేత‌ల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. కాగా, అగ్రరాజ్యంలో క‌రాళ నృత్యం చేస్తున్న కొవిడ్ వ‌ల్ల ఇప్ప‌టి వ‌ర‌కు 77 వేల‌కు పైగా మ‌ర‌ణాలు సంభ‌వించాయి. అలాగే 13 ల‌క్ష‌ల మంది ఈ వైర‌స్ బారిన ప‌డ్డారు. 


Updated Date - 2020-05-09T23:12:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising