ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా దెబ్బకు దిగజారిన స్పెయిన్ ఆర్థిక వ్యవస్థ..!

ABN, First Publish Date - 2020-08-03T14:08:25+05:30

కరోనా వైరస్‌ దెబ్బకు ప్రపంచమే అతలాకుతలమైంది. ఇక లాక్‌డౌన్‌తో వ్యాపారాలు లేక.. ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. ఐరోపాలో ఎక్కువగా ప్రభావితమైన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యారిస్‌, ఆగస్టు 2: కరోనా వైరస్‌ దెబ్బకు ప్రపంచమే అతలాకుతలమైంది. ఇక లాక్‌డౌన్‌తో వ్యాపారాలు లేక.. ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. ఐరోపాలో ఎక్కువగా ప్రభావితమైన ఫ్రాన్స్‌, ఇటలీ, స్పెయిన్‌ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాయి. ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్యకాలంలో స్పెయిన్‌ ఆర్థిక వ్యవస్థ 18.5 శాతం దిగజారింది. ఫ్రాన్స్‌లో 14 శాతం తగ్గుముఖం పట్టగా.. ఇటలీ ఎకానమీ 12.4 శాతం దిగజారింది. లాక్‌డౌన్‌ వలన షాపులు, ఫ్యాక్టరీలు, రెస్టారెంట్లు అన్నీ మూతపడ్డాయి. పర్యాటక రంగం పూర్తిగా కుదేలైంది. స్పెయిన్‌లో ఆర్థిక వ్యవస్థ మునుపెన్నడూ ఈ స్థాయిలో పతనం కాలేదు. స్పెయిన్‌ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ఏం చేయాలి అనే విషయాలపై చర్చించేందుకు ఆ దేశ ప్రధాని పెడ్రో శాంచెజ్‌ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఇక ఫ్రాన్స్‌ విషయానికొస్తే గతేడాది చివరి త్రైమాసికం నుంచే ఇక్కడి ఆర్థిక వ్యవస్థ దిగజారుతూ వస్తోంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనూ దాని పరిస్థితి బాగోలేదు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో (ఏప్రిల్‌ నుంచి జూన్‌) ఇది మరింత దిగజారింది. కాగా.. ఇటలీలో కరోనా దెబ్బకు 30 ఏళ్ల వృద్ధి తుడిచిపెట్టుకుపోయింది.

Updated Date - 2020-08-03T14:08:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising