ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రెజిల్‌లో కరోనా విలయం.. లక్షదాటిన మరణాలు!

ABN, First Publish Date - 2020-08-09T21:48:37+05:30

కరోనా వైరస్.. ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలోనూ ఈ మహమ్మారి ఉధృతి కొనసాగుతుండగా.. లాటిన్ అమెరికా దేశా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రెజీలియా: కరోనా వైరస్.. ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలోనూ ఈ మహమ్మారి ఉధృతి కొనసాగుతుండగా.. లాటిన్ అమెరికా దేశాల్లో సైతం కరోనా వైరస్ విజృంభిస్తోంది. ముఖ్యంగా బ్రెజిల్‌లో కొవిడ్-19.. కరాళ నృత్యం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో బ్రెజిల్‌లో 49,970 కేసులు నమోదవ్వగా.. 905 మంది మరణించినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో బ్రెజిల్‌లో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 30లక్షలు దాటింది. కరోనా కాటుకు బలైన వారి సంఖ్య 1,00,477కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. బ్రెజిల్‌లో కరోనా బారినపడిన వారి సంఖ్య.. అధికారిక లెక్కల కంటే ఆరు రెట్లు ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. కాగా.. బ్రెజిల్‌లో మొదటి కేసు ఫిబ్రవరి 26న నమోదవ్వగా.. మార్చి 12 తొలి మరణం సంభవించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1.98కోట్లు దాటగా.. 7.30లక్షల మంది మహమ్మారి కారణంగా బలయ్యారు.  


Updated Date - 2020-08-09T21:48:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising