ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోలుకున్న తర్వాత 8 రోజుల దాకా శరీరంలోనే: చైనా

ABN, First Publish Date - 2020-03-29T09:34:25+05:30

కరోనా చికిత్సపొంది పూర్తిగా కోలుకున్న తర్వాత కూడా 8 రోజుల దాకా రోగి శరీరంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్‌, మార్చి 28 : కరోనా చికిత్సపొంది పూర్తిగా కోలుకున్న తర్వాత కూడా 8 రోజుల దాకా రోగి శరీరంలో వైరస్‌ ఉండే అవకాశాలు ఉంటాయని చైనా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 9 మధ్యకాలంలో బీజింగ్‌లోని పీఎల్‌ఏ జనరల్‌ ఆస్పత్రిలో కొవిడ్‌-19 చికిత్సపొంది కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయిన 16 మంది రోగుల ఆరోగ్యాల్లో వచ్చిన మార్పులను విశ్లేషించడంతో ఈవిషయం వెల్లడైంది. ఇళ్లకు వెళ్లిపోయిన రోగులందరి నుంచి ఒకరోజు తప్పించి ఒకరోజు గొంతులోని స్రావాల శాంపిళ్లను సేకరించి పరీక్షలు జరిపారు. దీంతో వారిలో సగం మంది(8 మంది) శ్వాసకోశ వ్యవస్థలో ఇప్పటికీ కరోనా వైరస్‌ జాడ ఉన్నట్లు వెల్లడైంది. ఈ పరిస్థితుల్లోనూ వారిలో కరోనా లక్షణాలేవీ కనిపించలేదని తెలిపారు. ఈక్రమంలో వారు ఎవరినైనా కలిస్తే సులువుగా వైరస్‌ సంక్రమించే ముప్పు ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అధ్యయనంలో భారత సంతతి శాస్త్రవేత్త లోకేశ్‌ శర్మ(యేల్‌ వర్సిటీ) కూడా భాగస్తులయ్యారు. 

Updated Date - 2020-03-29T09:34:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising