ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేను చేసిన పొరపాటును మీరూ చేయకండి.. ప్రజలకు ఫ్రాన్స్ ప్రధాని సూచన!

ABN, First Publish Date - 2020-12-19T20:35:11+05:30

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌కు సోకిన విషయం తెలిసిందే. దీంతో కొవిడ్ బారినపడ్డ దేశాధ్యక్షుల జాబితాలో ఆయన చేరిపోయారు. కాగా.. ప్రస్తుతం ఐసోలేషన్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌కు సోకిన విషయం తెలిసిందే. దీంతో కొవిడ్ బారినపడ్డ దేశాధ్యక్షుల జాబితాలో ఆయన చేరిపోయారు. కాగా.. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్న ఆయన శుక్రవారం రోజు ప్రజలకు ఓ వీడియో సందేశాన్ని పంపారు. తాను చేసిన తప్పును చేయోద్దని.. జాగ్రత్తగా ఉండాలని  ప్రజలకు సూచించారు. వివరాల్లోకి వెళితే.. గత వారం ఈయూ సమ్మీట్‌లో పాల్గొన్న తర్వాత ఇమ్మాన్యుయెల్ మెక్రాన్‌కు వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో పరీక్ష చేయగా ఆయనకు వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో స్వీయ నిర్భందంలోకి వెళ్లిన ఆయన తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ప్రజలకు వీడియో సందేశాన్ని పంపించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉన్నట్టు 42ఏళ్ల ఫ్రాన్స్ ప్రెసిడెంట్ వీడియోలో పేర్కొన్నారు.



ఈయూ సమ్మీట్‌లో పాల్గొన్న తర్వాత కొద్దిగా అలసట, తలనొప్పి, పొడి దగ్గు రావడంతో కొవిడ్ పరీక్ష చేయించుకున్నట్టు తెలిపారు. అందులో పాజిటివ్‌ వచ్చినట్టు వివరించారు. అయితే తన నిర్లక్ష్యానికి కొద్దిగా దురదృష్టం కూడా తోడవ్వడం వల్లే మహమ్మారి బారినపడ్డట్టు చెప్పారు. వైరస్ ఏ ఒక్కరినీ విడిచిపెట్టదనే విషయాన్ని తాను గ్రహించినట్టు పేర్కొన్నారు. ప్రజలు నిర్లక్ష్యాన్ని వీడి మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు. తన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వీడియో సందేశాల ద్వారా వెల్లడిస్తానని చెప్పారు. ఇదిలా ఉంటే.. ఈయూ సమ్మీట్‌లో పాల్గొన్న స్లోవాక్ ప్రధాని కూడా కొవిడ్ బారినపడ్డారు. ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌‌కు వైరస్ సోకినట్టు తేలడంతో ఆయనతోపాటు సమావేశంలో పాల్గొన్న వారికి కరోనా టెస్టులు చేశారు. ఇందులో స్లోవాక్ ప్రధానికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. కాగా.. అమెరికా, బ్రెజిల్ అధ్యక్షులుకు కూడా వైరస్ సోకిన విషయం తెలిసిందే. 


Updated Date - 2020-12-19T20:35:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising