ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ఫ్యాన్లు వాడటం వెంటనే ఆపేయమంటూ.. అమెరికాలో..

ABN, First Publish Date - 2020-12-30T04:31:54+05:30

అమెరికాలోని ఓ ఫ్యాన్ కంపెనీకి చెందిన ఫ్యాన్లను వాడటం ఆపేయాలంటూ యూఎస్ కన్‌జ్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్ హెచ్చరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్: అమెరికాలోని ఓ ఫ్యాన్ కంపెనీకి చెందిన ఫ్యాన్లను వాడటం ఆపేయాలంటూ యూఎస్ కన్‌జ్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్ హెచ్చరించింది. వివరాల్లోకి వెళ్తే.. ‘కింగ్ ఆఫ్ ఫ్యాన్స్’ అనే సంస్థ 1.8 లక్షలకు పైగా ఫ్యాన్లను వినియోగదారులకు అమ్మింది. అయితే ఫ్యాన్ వేయగానే రెక్కలు ఊడిపోతున్నాయంటూ 47 మంది కస్టమర్లు సంస్థకు ఫోన్లు చేశారు. ఫ్యాన్ రెక్కలు ఊడిపోవడం వల్ల తమకు ఆస్తి నష్టం జరిగిందంటూ నలుగురు కస్టమర్లు, రెక్కలు ఊడిపోయి తమకు తగలడంతో గాయాలైనట్టు ఇద్దరు కస్టమర్లు రిపోర్ట్ చేశారు. దీంతో సేఫ్టీ కమిషన్ వెంటనే రంగంలోకి దిగింది. ఆ ఫ్యాన్లు వాడటం ప్రమాదమంటూ హెచ్చరించింది. దాదాపు రెండు లక్షల మంది ఈ ఫ్యాన్లను కొనుగోలు చేయడంతో వారందరికి ఫ్యాన్లను వాడటం వెంటనే ఆపేయాలంటూ సూచించింది. మరోపక్క ఫ్యాన్ సంస్థ సైతం కస్టమర్లకు ఫోన్లు చేస్తూ సమాచారమిస్తోంది.

Updated Date - 2020-12-30T04:31:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising