ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కీలక నిర్ణయంతో టిక్‌టాక్‌కు శుభం కార్డు వేసిన ట్రంప్..!

ABN, First Publish Date - 2020-09-19T00:16:12+05:30

ప్రముఖ వీడియో షేరింగ్ యాప్.. టిక్‌టాక్ కథకు అమెరికాలో ఎండ్ కార్డు పడింది. టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ అ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: ప్రముఖ వీడియో షేరింగ్ యాప్.. టిక్‌టాక్ కథకు అమెరికాలో ఎండ్ కార్డు పడింది. టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ అమెరికాలో తన దుకాణాన్ని మూసేయాల్సిన సమయం వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. దేశ భద్రతకు ముప్పువాటిల్లే ప్రమాదం ఉందనే కారణంతో భారత ప్రభుత్వం టిక్‌టాక్ సహా చైనాకు సంబంధించిన చాలా యాప్‌లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలంగా చైనాపై గుర్రుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్‌ను అనుసరించారు.


చైనాకు సంబంధించిన టిక్‌టాక్, వుయ్‌చాట్‌ వల్ల.. దేశ భద్రతకు ప్రమాదం పొంచి ఉందనే కారణంతో ఆ యాప్‌లపై బ్యాన్ విధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ క్రమంలో టిక్‌టాక్ మాతృసంస్థకు ట్రంప్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. అమెరికాలో టిక్‌టాక్ కార్యకలాపాలను అమెరికా సంస్థకు అమ్మేయాల్సిందిగా సూచించారు. అందుకు కొంత గుడువు కూడా ఇచ్చారు.


దీంతో దిగ్గజ కంపెనీలన్నీ అమెరికాలో టిక్‌టాక్ కార్యకలాపాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో టిక్‌టాక్ కార్యకలాపాలను ఒరాకిల్ చేజిక్కించుకోనుందని.. మెజారిటీ వాటాను తన వద్ద పెట్టుకుని, మైనారిటీ వాటాను మాత్రం ఒరాకిల్‌కు అమ్మేందుకు బైట్‌డ్యాన్స్ సుముఖత వ్యక్తం చేసిందనే వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఒరాకిల్‌తో బైట్‌డ్యాన్స్ కుదుర్చుకునే ఒప్పందాన్ని తాను ఆమోదించనని ప్రకటించారు. అంతేకాకుండా అమెరికాలో టిక్‌టాక్ పూర్తి కార్యకలాపాలను తమ దేశంలోని సంస్థకే అమ్మేయాలని ట్రంప్ స్పష్టం చేశారు.


ఈ నేపథ్యంలో ట్రంప్ సర్కార్ శుక్రవారంరోజు కీలక ప్రకటన చేసింది. అమెరికాలో టిక్‌టాక్ సహా వుయ్‌చాట్‌పై విధించిన నిషేధాజ్ఞలు ఆదివారం నుంచి అమలులోకి రానున్నట్లు వెల్లడించింది. ఆదివారం నుంచి ఆ యాప్‌లకు సంబంధించిన కార్యకపాలు అమెరికాలో నిలిచిపోనున్నట్లు స్పష్టం చేసింది. అంతేకాకుండా  అన్ని యాప్‌స్టోర్ల నుంచి టిక్‌టాక్‌, వుయ్‌చాట్‌ యాప్‌లను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. 


Updated Date - 2020-09-19T00:16:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising