ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనా భారీ మూల్యం చెల్లించక తప్పదు: ట్రంప్

ABN, First Publish Date - 2020-10-08T20:36:53+05:30

డ్రాగన్ దేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. మిలటరీ ఆసుపత్రి నుంచి వైట్‌హౌస్‌కు చేరిన ట్రంప్.. సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: డ్రాగన్ దేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. మిలటరీ ఆసుపత్రి నుంచి వైట్‌హౌస్‌కు చేరిన ట్రంప్.. సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో ‘చైనా భారీ మూల్యం చెల్లించక తప్పదు’ అంటూ వ్యాఖ్యానించారు. వివరాల్లోకి వెళితే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి డిబేట్‌లో పాల్గొన్న తర్వాత ట్రంప్ కరోనా బారినపడ్డ విషయం తెలిసిందే. అనంతరం ఆయన మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొంది.. సోమవారం సాయంత్రం తిరిగి వైట్‌హౌస్‌కు చేరుకున్నారు. ట్రంప్ శ్వేతసౌధానికి చేరి 50 గంటలు కూడా గడవకముందే.. చైనాపై విరుచుకుపడుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రపంచంలో కరోనా వైరస్ విజృంభించడానికి చైనానే కారణమన్నారు. మహమ్మారి లక్షల మంది ప్రాణాలను బలితీసుకుందన్నారు. కోట్లాది మందిని నిరుద్యోగుల్ని చేసి, రోడ్డున పడేసిందన్నారు. కరోనా వైరస్ విలయం సృష్టించడానికి కారణమైన చైనా భారీమూల్యం చెల్లించక తప్పదన్నారు. ‘ఇది మీ వైఫల్యం కాదు. చైనా తప్పిదం. దీనికి చైనా భారీ మూల్యం చెల్లించుకోబోతోంది. ఇది చైనా వైఫల్యం. అది గుర్తుంచుకోండి’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే అమెరికాలో ఇప్పటి వరకు 70 లక్షల మందికిపైగా కరోనా బారినపడగా.. మరణించిన వారి సంఖ్య 2.16లక్షలు దాటింది. 


Updated Date - 2020-10-08T20:36:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising