ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనాలో గప్‌చుప్‌గా కరోనా టీకాలు!

ABN, First Publish Date - 2020-09-28T13:19:50+05:30

కరోనా వ్యాక్సిన్లతో మూడోదశ ప్ర యోగ పరీక్షలు జరుగుతుండగానే..వాటి ‘అత్యవసర’ వినియోగానికి చైనా తలుపు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ప్రయోగ దశల్లోనే ‘అత్యవసర’ వినియోగం
  • నోరు విప్పొద్దంటూ ప్రజలతో ఒప్పందాలు

బీజింగ్‌, సెప్టెంబరు 27: కరోనా వ్యాక్సిన్లతో మూడోదశ ప్ర యోగ పరీక్షలు జరుగుతుండగానే..వాటి ‘అత్యవసర’ వినియోగానికి చైనా తలుపులు తెరిచింది. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, శాస్త్రవేత్తలు, ఫార్మా కంపెనీల సిబ్బంది, సైనికులు, పోలీసులు, కస్టమ్స్‌, సూపర్‌ మార్కెట్ల సిబ్బంది, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు వంటివారికి ‘అత్యవసర’ వ్యాక్సిన్లు వేస్తోంది. దీంతో వారి ఆరోగ్య భద్రత ప్రశ్నార్ధకంగా మారుతోంది. ‘అత్యవసర’ వ్యాక్సిన్‌ వేయించుకొని లక్షలాది మందికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నా చైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శ లు వెల్లువెత్తుతున్నాయి. పైగా అత్యవసర వ్యాక్సిన్‌వల్ల తలెత్తే దుష్ప్రభావాల గురించి ఎవరికీ చెప్పొద్దంటూ వ్యాక్సినేషన్‌ సమయంలోనే వారితో ‘నాన్‌ డిస్‌క్లోజర్‌’ ఒప్పందాలపై సంతకాలు చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. అత్యవసర వ్యాక్సిన్‌ అనర్ధాలు సృష్టిస్తోందని తెలిసినా చైనాలోని కంపెనీల ఉద్యోగు లు ప్రభుత్వ ఆదేశాలను తిరస్కరించే సాహసం చేయలేక పోతున్నారని పరిశీలకులు అంటున్నారు. సినోఫార్మ్‌, సినోవ్యాక్‌ కంపెనీలు అభివృద్ధి చేసిన ప్రయోగాత్మక కొవిడ్‌ వ్యాక్సిన్లను అత్యవసర ప్రాతిపదికన లక్షలాది మందికి అందించారని సమాచారం. వీటిని చైనా హెల్త్‌ కమిషన్‌ కొట్టి పారేస్తోంది.


Updated Date - 2020-09-28T13:19:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising