ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూటాన్‌పైనా డ్రాగన్‌ కన్ను

ABN, First Publish Date - 2020-09-14T14:04:42+05:30

లద్దాఖ్‌లో చొచ్చుకొస్తూ భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా.. ఇపుడు భూటాన్‌ పైనా కన్నేసింది. భూటాన్‌తో ఇప్పటికే డ్రాగన్‌కు సరిహ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

813 చ. కిమీ కలిపేసుకునేందుకు వ్యూహం

 రోడ్ల, స్థావరాల పనులు ముమ్మరం..

జాగ్రత్తగా ఉండాలని భారత్‌ హితవు

పీఎల్‌ఏ దురాక్రమణతో మనకూ ముప్పే!


న్యూఢిల్లీ, సెప్టెంబరు 13: లద్దాఖ్‌లో చొచ్చుకొస్తూ భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా.. ఇపుడు భూటాన్‌ పైనా కన్నేసింది. భూటాన్‌తో ఇప్పటికే డ్రాగన్‌కు సరిహద్దు గొడవలున్నాయి. కొద్ది వారాల్లో రెండు దేశాల మధ్య 25వ రౌండు చర్చలు జరగనున్నాయి. వాటితో సంబంధం లేకుండా చైనా అనేకచోట్ల కొత్త కొత్త రోడ్లు వేస్తూ, నిర్మాణాలు చేపడుతూ, స్థావరాలు నిర్మించుకుంటూ పోతోంది.


భూటాన్‌ సెంట్రల్‌ సెక్టార్‌లో 318 చదరపు కిలోమీటర్లు, పశ్చిమ సెక్టార్‌లో 495 చదరపు కిలోమీటర్ల భూమి తమదేనని వాదిస్తోంది. ఈ రెండు సెక్టార్లలో కొంతభాగాన్ని పీఎల్‌ఏ దళాలు అధీనంలోకి తెచ్చుకున్నాయి. కాగా.. చైనా దురాక్రమణ భారత్‌కీ ముప్పే. భూటాన్‌ సరిహద్దులు.. పశ్చిమబెంగాల్‌లోని సిలిగురి కారిడార్‌లోకి వస్తాయి.


అవి చైనా వశమైతే భారత్‌కు మరో తలనొప్పి. అటు అరుణాచల్‌, లద్దాఖ్‌, సిక్కిం... వీటితో పాటు సిలిగురి వద్ద కూడా చైనా దుందుడుకు పోకడలను అడ్డుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఈ దృష్ట్యానే చైనా తీరుపై జాగ్రత్తగా ఉండాలని, సొంత భూభూగాన్ని వదులుకోవద్దని భారత్‌- భూటాన్‌ను పలుమార్లు హెచ్చరించింది. చైనాతో జరిగే చర్చల్లో అనుసరించే వ్యూహాన్ని కూడా భారతే సిద్ధం చేస్తోందని సమాచారం. 


Updated Date - 2020-09-14T14:04:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising