అత్యుత్సాహం ప్రదర్శించిన రెస్టారెంట్.. చివరికి ప్రజలకు..!
ABN, First Publish Date - 2020-08-23T01:56:32+05:30
అధ్యక్షుడి ఆదేశాలను పాటించాలనే ఆత్రుతతో చైనాలోని ఓ రెస్టారెంట్ అత్యుత్సాహం ప్రదర్శించింది. ఆ అత్యత్సాహం విమర్శలకు దారి తీయడంతో రెస్టారెంట్ వెనక్కి త
బీజింగ్: అధ్యక్షుడి ఆదేశాలను పాటించాలనే ఆత్రుతతో చైనాలోని ఓ రెస్టారెంట్ అత్యుత్సాహం ప్రదర్శించింది. ఆ అత్యత్సాహం విమర్శలకు దారి తీయడంతో రెస్టారెంట్ వెనక్కి తగ్గింది. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా ప్రజలకు క్షమాపణలు చెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. చైనాలో గత నెలలో భారీగా వరదలు వచ్చాయి. ప్రపంచాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఆహార పదార్థాల ధరలు భారీగా పెరుగుతాయని ఊహించిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆహార పదార్థాలను పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఆహర వృథాని అరికట్టేందుకు ‘ఆపరేషన్ క్లీన్ ప్లేట్’ను ప్రవేశపెట్టారు. ఇందులో రెస్టారెంట్‌లకు కోసం ప్రత్యేక నిబంధనలు పెట్టారు.
ఈ క్రమంలో చాంగ్షా నగరంలోని ఓ రెస్టారెంట్.. అత్యుత్సాహం ప్రదర్శించింది. రెస్టారెంట్ ద్వారాల వద్ద వెయింగ్ మిషన్‌లను ఏర్పాటు చేసింది. తమ రెస్టారెంట్‌లోకి వచ్చిన కస్టమర్లను మొదటగా వెయింగ్ మిషన్‌లపై బరువు కొలుచుకోవాలని సూచించింది. అంతేకాకుండా వారి బరువుకు సంబంధించిన సమాచారాన్ని ఓ ప్రత్యేక యాప్‌లో నమోదుచేయాలని.. యాప్ సూచించిన విధంగానే ఆహార పదార్థాలను ఆర్డర్ చేయాలని నిబంధన పెట్టింది. దీంతో రెస్టారెంట్ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెస్టారెంట్ వైఖరిని నిరసిస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. ఈ నేపథ్యంలో సదరు రెస్టారెంట్ వెనక్కి తగ్గింది. సోషల్ మీడియా వేదికగా.. ప్రజలను క్షమాపణలు కోరింది.
Updated Date - 2020-08-23T01:56:32+05:30 IST