ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టిక్‌టాక్ విషయంలో అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్థ సూత్రాలు తప్పుతోంది: చైనా

ABN, First Publish Date - 2020-08-04T22:22:40+05:30

వీడియో షేరింగ్ యాప్‌ టిక్‌టాక్ విషయంలో అమెరికా ప్రభుత్వం బెదిరింపులకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్: వీడియో షేరింగ్ యాప్‌ టిక్‌టాక్ విషయంలో అమెరికా ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని చైనా ప్రభుత్వం ఆరోపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టిక్‌టాక్ అమెరికా ఆపరేషన్స్‌ను అమెరికన్ కంపెనీకి అప్పగించేలా టిక్‌టాక్ సంస్థపై ఒత్తిడి తీసుకొస్తున్నారని విదేశాంశాఖ అధికారి వాంగ్ వెన్బిన్ తెలిపారు. ఇది మార్కెట్ ఎకానమీ సూత్రాలకు, ప్రపంచ వాణిజ్య సంస్థలోని బహిరంగత, పారదర్శకత సూత్రాలకు పూర్తి వ్యతిరేకమని వాంగ్ పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వం జాతీయ భద్రత పేరుతో ఎటువంటి ఆధారాలు లేకుండా విదేశీ కంపెనీలను అణచివేయాలని చూస్తోందని వాంగ్ ఆరోపించారు. విదేశీ కంపెనీలు అంతర్జాతీయ చట్టాలతో పాటు అమెరికా చట్టాలకు అనుగుణంగానే తమ వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయన్నారు. అయితే ట్రంప్ మాత్రం రాజకీయాలు చేస్తూ.. మోసపూరిత ఆరోపణలతో ఆయా కంపెనీలపై విరుచుకుపుడుతున్నారని వాంగ్ మండిపడ్డారు. కాగా.. టిక్‌టాక్ అమెరికా ఆపరేషన్స్‌ను మైక్రోసాఫ్ట్ సంస్థ తీసుకోవాలని చూస్తోంది. ఈ ఒప్పందానికి సంబంధించి ట్రంప్ టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌కు 45 రోజుల గడువునిచ్చినట్టు వార్తలొచ్చాయి. ఇదే సమయంలో బైట్‌డ్యాన్స్ ట్రంప్‌కు నిరాశ కలిగించేందుకు తమ ప్రధాన కార్యాలయాన్ని బీజింగ్ నుంచి లండన్‌కు మార్చేందుకు సిద్దమైంది. 


Updated Date - 2020-08-04T22:22:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising