ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యతిరేకత నేపధ్యంలో... షికాగో విద్యాసంస్థలు ఆన్‌లైన్‌లో మాత్రమే

ABN, First Publish Date - 2020-08-06T23:26:10+05:30

అమెరికా అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల నేపధ్యంలో పలు విద్యాసంస్థలు ఇన్ క్లాస్ బోధనను ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా... కిందటి నెల 30 వ తేదీన... ఇండియానా లోని గ్రీన్ఫిల్డ్ సెంట్రల్ జూనియర్ హై స్కూల్ లో ఓ భారత విద్యార్థికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షికాగో : అమెరికా అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల నేపధ్యంలో పలు విద్యాసంస్థలు ఇన్ క్లాస్ బోధనను ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా... కిందటి నెల 30 వ తేదీన... ఇండియానా లోని గ్రీన్ఫిల్డ్ సెంట్రల్ జూనియర్ హై స్కూల్ లో ఓ భారత విద్యార్థికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.


మరికొన్ని విద్యాసంస్థలలోని  ఉపాధ్యాయులకు కూడా వైరస్ సోకినట్లు సమాచారం. కాగా... సమ్మె చేస్తామంటూ కొన్ని వారాల క్రితం అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టీచర్స్ సమ్మె చేస్తామని హెచ్చరించిన నేపధ్యంలో... షికాగో లోని విద్యా సంస్థలు కూడా ఇన్ క్లాస్ బోధనను ప్రారంభిస్తాయని షికాగో మేయర్ లోరీ లైట్‌ఫుట్ తెలిపారు.


షికాగో టీచర్స్ యూనియన్ విద్యాసంస్థల భద్రతపై సమ్మెకు తాత్కాలిక సన్నాహాల చేస్తున్నట్లు తెలిసింది. ఇలాంటి పరిస్థితిలో తల్లిదండ్రులు విద్యాసంస్థలకు వారి పిల్లలను పంపటానికి భయపడుతున్న విషయం తెలిసిందే.


ఈ నేపధ్యంలో... అమెరికా లోని మూడవ అతిపెద్ద జిల్లా అయినా షికాగో లో వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ దృష్ట్యా సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానున్న విద్యా సంవత్సరం ఆన్‌లైన్  మాత్రమే ప్రారంభమవుతుందని షికాగో పబ్లిక్ స్కూల్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జానైస్ జాక్సన్ ప్రకటించినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. 

Updated Date - 2020-08-06T23:26:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising