ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాకిస్థాన్ నుంచి కాంబోడియాకు.. విమానంలో ప్రయాణించనున్న ఏనుగు

ABN, First Publish Date - 2020-11-28T19:54:46+05:30

పాకిస్థాన్‌లో 35 ఏళ్ల నుంచి ఒంటరిగా జీవిస్తున్న కావన్ అనే ఏనుగుకు ఎట్టకేలకు విముక్తి కలిగింది. అమెరికన్ సింగర్ చేర్ ఆదివారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో 35 ఏళ్ల నుంచి ఒంటరిగా జీవిస్తున్న కావన్ అనే ఏనుగుకు ఎట్టకేలకు విముక్తి కలిగింది. అమెరికన్ సింగర్ చేర్ ఆదివారం కావన్‌ను పాకిస్థాన్ నుంచి కాంబోడియాకు తీసుకెళ్లనున్నారు. శుక్రవారం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో చేర్ భేటీ అయ్యారు. అనంతరం కావన్‌ను కాంబోడియాకు పంపేందుకు సహాయపడినందుకు ట్విటర్ ద్వారా ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. మరోపక్క కావన్‌ను కాంబోడియాకు తరలించేందుకు ముందుకొచ్చినందుకు చేర్‌కు ఇమ్రాన్ ఖాన్ అభినందనలు తెలిపారు. అంతేకాకుండా భవిష్యత్తులో పాకిస్థాన్‌లో జరిగే పర్యావరణ కార్యక్రమాల్లో చేర్ పాల్గొనాల్సిందిగా ఇమ్రాన్ ఖాన్ కోరినట్టు పీఎంఓ ఆఫీసు ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా.. కావన్‌ను పాకిస్థాన్ నుంచి కాంబోడియాలోని సియెమ్ రీప్ ప్రావిన్స్‌కు తరలించనున్నారు. ఇంతకాలం ఒంటరిగా జీవిస్తూ వచ్చిన కావన్‌ ఇకపై ఏనుగులతో ఉండే జూలో ఉండనుంది. కావన్‌ను విమానంలో తరలించనున్నట్టు అధికారులు వెల్లడించారు. కావన్ మొత్తం 10 గంటల పాటు విమానంలో ప్రయాణం చేయనుంది. 

Updated Date - 2020-11-28T19:54:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising