ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూఏఈకి ఎన్నారైల త‌ర‌లింపుపై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

ABN, First Publish Date - 2020-05-31T18:41:11+05:30

యూఏఈకి ఎన్నారైల త‌ర‌లింపుపై కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూఏఈ: యూఏఈకి ఎన్నారైల త‌ర‌లింపుపై కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. యూఏఈ వీసా క‌లిగిన ఎన్నారైల‌ను అక్క‌డి ప్ర‌భుత్వం ఆంక్ష‌లు తొలిగించిన త‌ర్వాతే త‌ర‌లిస్తామ‌ని పేర్కొంది. యూఏఈ వెళ్లేందుకు ప్ర‌వాసుల నుంచి భారీ సంఖ్య‌లో అభ్య‌ర్థ‌న‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో కేంద్రం ఈ ప్ర‌క‌టన చేసింది. కాగా... విదేశీయుల‌ను త‌మ దేశంలోకి అనుమ‌తించే విష‌యంలో యూఏఈలో ఇంకా ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయని తెలిపింది. క‌నుక ఆంక్ష‌లు తొలిగిపోయిన త‌ర్వాత యూఈఏ వీసాదారుల‌ను తిరిగి అక్క‌డికి పంపిస్తామ‌ని పేర్కొంది.


ఈ మేర‌కు కేంద్ర పౌర‌విమాన‌యాన శాఖ మంత్రి హ‌ర్దీప్ సింగ్ పూరీ యూఏఈ వీసా హోల్డ‌ర్ల‌ను ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు. కాగా, క‌రోనా లాక్‌డౌన్ వల్ల ప్ర‌యాణాల‌పై ఆంక్ష‌లు విధించ‌డంతో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన యూఏఈ వీసాదారుల‌ను జూన్ 1 నుంచి తిరిగి యూఏఈ వ‌చ్చేందుకు అక్క‌డి స‌ర్కార్‌ అనుమ‌తి ఇచ్చింది. దీనికోసం వీసాదారులు ఆన్‌లైన్‌లో త‌మ పేరు, వివ‌రాల‌ను రిజిస్ట‌ర్ చేసుకోవాల‌ని సూచించింది. మే 18 నుంచి ఈ ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌ను ప్రారంభించింది. యూఏఈ వీసాదారులు https://smartservices.ica.gov.ae. వెబ్‌సైట్ ద్వారా త‌మ పేరును న‌మోదు చేసుకోవ‌చ్చు.   

Updated Date - 2020-05-31T18:41:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising