ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుప్పకూలిన కార్గో విమానం.. డబ్బుల కోసం ఎగబడ్డ స్థానికులు

ABN, First Publish Date - 2020-08-23T04:21:39+05:30

సూడాన్‌లో టేక్ ఆఫ్ అయిన కాసేపటికే కార్గో విమానం కుప్పుకూలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జూబా, సూడాన్: సూడాన్‌లో టేక్ ఆఫ్ అయిన కాసేపటికే కార్గో విమానం కుప్పుకూలింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 17 మంది మరణించినట్టు వార్తలొస్తున్నాయి. 15 మంది ప్యాసెంజర్లతో పాటు ఇద్దరు సిబ్బంది ఈ ప్రమాదంలో మరణించినట్టు అధికారులు చెబుతున్నారు. తీవ్ర గాయాలపాలైన ఓ వ్యక్తిని ఆసుపత్రికి తరలించామని.. అతడి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. రాజధాని జూబా సమీపంలో ఉన్న ఎయిర్‌పోర్ట్ నుంచి శనివారం ఉదయం 9 గంటలకు(అక్కడి సమయం ప్రకారం) ఈ విమానం బయలుదేరినట్టు తెలుస్తోంది. ఎన్జీవోల కోసం డబ్బు, ఆహారం, వాహనాలు, స్పేర్ పార్ట్‌లను విమానం తీసుకెళ్తున్నట్టు ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ కుర్ కౌల్ పేర్కొన్నారు. విమానం గాల్లోకి వెళ్లిన కాసేపటికే కుప్పకూలినట్టు.. వెంటనే అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నట్టు మీడియా చెబుతోంది. ఈ కార్గో విమానం సౌత్ వెస్ట్ ఏవియేషన్‌కు చెందినదిగా తెలుస్తోంది. కాగా.. విమానం కుప్పకూలిన సమయంలో డబ్బులు మొత్తం చెల్లాచెదురుగా పడ్డాయని.. ఇదే సమయంలో చుట్టు పక్కల ప్రజలు డబ్బుల కోసం ఎగబడ్డారని కుర్ కౌల్ తెలిపారు.

Updated Date - 2020-08-23T04:21:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising