ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కెనడా ప్రజలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్!

ABN, First Publish Date - 2020-12-04T22:13:44+05:30

కెనడా ప్రభుత్వం ఆ దేశ ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పింది. కొవిడ్ టీకాను అందించేందుకు సిద్ధం అవుతున్నట్లు ప్రకటించింది. వివరాల్లోకి వెళితే.. కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తున్న వేళ.. యావత్ ప్రపంచం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒట్టావా: కెనడా ప్రభుత్వం ఆ దేశ ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పింది. కొవిడ్ టీకాను అందించేందుకు సిద్ధం అవుతున్నట్లు ప్రకటించింది. వివరాల్లోకి వెళితే.. కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తున్న వేళ.. యావత్ ప్రపంచం టీకా కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసింది. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఫైజర్, మోడెర్నాతోపాటు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి ప్రపంచ దేశాలకు శుభవార్త చెప్పాయి. తాము అభివృద్ధి చేస్తున్న టీకా మహమ్మారి సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్టు ప్రకటించాయి. అంతేకాకుండా ఫైజర్, మోడెర్నా సంస్థలు తాము తయారు చేసిన వ్యాక్సిన్‌ను అత్యవసరంగా వినియోగించేందుకు అనుమతి ఇవ్వాలని దరఖాస్తు కూడా చేసుకున్నాయి.



ఈ క్రమంలో కెనడా ప్రభుత్వం తమ దేశ ప్రజలకు కొవిడ్ టీకాను అందించేందుకు రెడీ అవుతోంది. కెనడాలో వ్యాక్సిన్ పంపిణీ బాధ్యతలను చూసుకునే డేనీ ఫార్టిన్ గురువారం మీడియా మాట్లాడుతూ.. కొవిడ్ వ్యాక్సిన్‌ను జనవరి నుంచి దేశ వ్యాప్తంగా ప్రజలకు అందించడం కోసం కెనడా ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు. వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ కోసం ప్రభుత్వం మిలటరీ సహాయాన్ని తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే మిలటరీ అధికారులతో ప్రభుత్వం చర్చలు కూడా జరిపినట్టు తెలిపారు. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు కెనడాలో 3.90లక్షల మంది కొవిడ్ బారినపడగా.. 12,300 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2020-12-04T22:13:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising