ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ఎఫెక్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న యూఎస్, కెనడా..!

ABN, First Publish Date - 2020-07-16T05:07:09+05:30

కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా-కెనడా కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఆగస్టు 21 వరకు ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దును మూసేయాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒట్టావా: కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా-కెనడా కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఆగస్టు 21 వరకు ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దును మూసేయాలనే నిర్ణయానికి వచ్చాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్ ప్రపంచ దేశాలపై పంజా విసరడంతో యావత్ ప్రపంచం స్వీయ నిర్భంధంలోకి వెళ్లాయి. ఆర్థిక వ్యవస్థను ద‌‌‌ృష్టిలో పెట్టుకుని.. లాక్‌డౌన్ నిబంధనలు సడలించాయి. అయితే అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా-కెనడాల మధ్య ఉన్న సరిహద్దును ఆగస్టు 21 వరకు మూసేయాలని ఇరు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. కరోనా కారణంగా మర్చి 21 నుంచి ఇరు దేశాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇదిలా ఉంటే.. అత్యవసర సరుకులను రవాణా చేసే వాహనాలు, హెల్త్ కేర్ వర్కర్‌లకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుందని ఇరు దేశాలు స్ఫష్టం చేశాయి. అంతేకాకుండా టూరిస్టులను ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని వెల్లడించాయి. కాగా.. అమెరికాలో కరోనా విలయం కోనసాగుతోంది. ఇప్పటి వరకు అమెరికాలో 34 లక్షల మంది కరోనా బారినపడగా.. లక్షా 33వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2020-07-16T05:07:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising