ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికా బాటలో కెనడా..

ABN, First Publish Date - 2020-12-24T15:11:47+05:30

అమెరికన్ బయోటెక్ సంస్థ మోడెర్నా రూపొందించిన కరోనా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి కెనడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒట్టావా: అమెరికన్ బయోటెక్ సంస్థ మోడెర్నా రూపొందించిన కరోనా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి కెనడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు హెల్త్ కెనడా బుధవారం కీలక  ప్రకటన చేసింది. ఫైజర్ టీకాకు ఆమోదం తెలిపిన రెండు వారాల తర్వాత మోడెర్నా వ్యాక్సిన్‌కు కూడా కెనడా అనుమతి ఇచ్చింది. దీంతో అమెరికా తర్వాత మోడార్నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రెండో దేశంగా కెనడా నిలిచింది. ఇక ఫైజర్‌, మోడెర్నా టీకాలు మెసెంజర్ RNA సాంకేతికతతో అభివృద్ధి చేశారు. దీంతో ఫైజర్‌ను మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ వద్ద స్టోర్ చేయాల్సి ఉండగా.. మోడెర్నాను మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ వద్ద స్టోర్ చేయాలని కెనడా అధికారులు వెల్లడించారు. 


కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ మోడెర్నాతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ నెల చివరి వరకు 1,68,000 డోసుల వ్యాక్సిన్ తమ చేతికి వస్తుందన్నారు. మొత్తం 40 మిలియన్ల డోసుల కోసం మోడెర్నాతో డీల్ చేసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా, కెనడా డిసెంబర్ 14 నుంచి ఫైజర్ వ్యాక్సినేషన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. 2021 మొదటి త్రైమాసికం వరకు 3 మిలియన్ల మందికి టీకా అందించాలనే లక్ష్యంగా ట్రూడో సర్కార్ ముందుకెళ్తోంది. ఇదిలా ఉంటే.. కెడాలో మహమ్మారి ప్రభావం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 5.23 లక్షల మంది కరోనా బారిన పడగా.. 14,500 మంది మరణించారు.  

Updated Date - 2020-12-24T15:11:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising