ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికా వదిలి మీ దేశానికి వెళ్లిపోండంటూ..

ABN, First Publish Date - 2020-05-28T01:04:47+05:30

కరోనా మహమ్మారి అమెరికాను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఇదే స

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియా: కరోనా మహమ్మారి అమెరికాను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో అమెరికాలోని ఇతర దేశస్థులపై కొద్ది నెలల నుంచి దాడులు కూడా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఏషియన్ అమెరికన్ల ఇళ్లపై ద్వేషపూరిత రాతలు రాసిన ఓ అమెరికన్ మహిళను తాజాగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియా రీజియన్‌లో నివసిస్తున్న ఏషియన్ అమెరికన్ల ఇళ్లపై ద్వేషపూరితమైన రాతలు కనిపించాయి. ‘నువ్వు వేరే దేశంలో పుట్టి ఉంటే.. వెంటనే అమెరికాను వదిలి వెళ్లిపో’ అంటూ ఓ కాగితం మీద రాసి ఎవరో తెలియని వారు ఏషియన్ అమెరికన్ల ఇళ్లపై అంటించారు. పోలీసులు దర్యాప్తు చేయగా.. నాన్సీ ఆరెకిగా(52) అనే మహిళ ఈ జాత్యహంకార పనికి పాల్పడినట్టు గుర్తించారు. మరోపక్క మహిళ పోస్టర్లు అంటించడం ఓ ఇంటి ముందున్న కెమెరాలో రికార్డ్ అయింది. కాగా.. కరోనా మహమ్మారి కారణంగా కాలిఫోర్నియా ప్రభుత్వం చిన్న చిన్న నేరాలకు పాల్పడిన వారికి వెంటనే జీరో బెయిల్ ఇస్తోంది. జైళ్లలో నేరస్థుల సంఖ్యను తగ్గించడం ద్వారా కరోనాను నియంత్రించవచ్చని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో నిందితురాలు కూడా జీరో బెయిల్‌పై విడుదలైంది. అయితే ఆమె ఈ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరవ్వాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-05-28T01:04:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising