ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేయర్‌గా ఎన్నికైన కోమాలో ఉన్న నేత.. బ్రెజిల్‌లో..

ABN, First Publish Date - 2020-12-01T07:51:09+05:30

బ్రెజిల్‌లోని గోయానియా నగర మేయర్‌గా మగీటో విలేలా అనే వ్యక్తి ఎన్నికయ్యారు. ఆదివారం ఎన్నికల ఫలితాలు వెలువడగా.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రియో డీ జనైరో: బ్రెజిల్‌లోని గోయానియా నగర మేయర్‌గా మగీటో విలేలా అనే వ్యక్తి ఎన్నికయ్యారు. ఆదివారం ఎన్నికల ఫలితాలు వెలువడగా.. మగీటో మేయర్‌ అభ్యర్థిగా ఎన్నికైనట్టు ఆయన పార్టీ వెల్లడించింది. అయితే కొద్ది రోజుల క్రితం మగీటో కరోనా బారిన పడటంతో ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నారు. మేయర్‌గా ఎన్నికైన విషయం కూడా మగీటోకు తెలియకపోవడం విచారకరమని ఆయన పార్టీ నేతలు, కుటుంబసభ్యులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మాజీ సెనెటర్ అయిన మగీటో అక్టోబర్ 20వ తేదీన కరోనా బారిన పడ్డారు. పరిస్థితి సీరియస్ కావడంతో అక్టోబర్ 30వ తేదీన ఆయనను వెంటిలేటర్‌పైకి మార్చారు. నవంబర్ 8న వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చినప్పటికి.. తిరిగి నవంబర్ 15 నుంచి ఆయనకు మళ్లీ వెంటిలేటర్‌పై చికిత్స అందించాల్సి వచ్చింది. 


కాగా.. వైస్ మేయర్‌గా ఎన్నికైన రొజేరియో మాట్లాడుతూ.. మగీటోను ఎన్నుకున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. ఇదిలా ఉంటే.. మగీటో చనిపోయాడంటూ ప్రత్యర్థ పార్టీలు ప్రచారం చేయడంపై మగీటో కొడుకు డేనియెల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-12-01T07:51:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising