ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కేసుల్లో రష్యాను దాటేసిన బ్రెజిల్..!

ABN, First Publish Date - 2020-05-25T00:58:11+05:30

కరోనా వైరస్ ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోందన్న విషయం తెలిసిందే. కాగా.. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోందన్న విషయం తెలిసిందే. కాగా.. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో.. రష్యాను బ్రెజిల్ దాటేసింది. ప్రపంచంలోనే ఎక్కువ కేసులు నమోదైన దేశాల జాబితాలో రష్యా రెండో స్థానంలో ఉండేది. అయితే బ్రెజిల్‌లో నిన్న ఒక్కరోజే 16వేలకుపైగా కరోనా కేసులు నమోదు కావడంతో రష్యా స్థానాన్ని బ్రెజిల్ ఆక్రమించింది. బ్రెజిల్‌లో ఇప్పటి వరకు 3.49లక్షల కరోనా కేసులు నమోదవ్వగా.. రష్యాలో ఈ కేసుల సంఖ్య 3.44లక్షలుగా ఉంది. కరోనా మరణాల సంఖ్య పరంగా చూస్తే.. అత్యధిక మరణాలు సంభవించిన దేశాల జాబితాలో బ్రిటన్ రెండో స్థానంలో ఉంది. బ్రిటన్‌లో ఇప్పటి వరకు 2.57లక్షల మందికి వైరస్ సోకగా.. 36వేల మందికిపైగా మరణించారు. ఇదిలా ఉంటే.. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు, మరణాలు సంభవించన దేశాల జాబితాలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. యూఎస్‌ఏలో 16.67లక్షల మంది మహమ్మారి బారినపడగా.. దాదాపు 99వేల మంది మృత్యువాత పడ్డారు. 


Updated Date - 2020-05-25T00:58:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising