ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో అమరావతి నినాదాలు.. వాషింగ్టన్‌ డీసీలో ఎన్నారైల గర్జన

ABN, First Publish Date - 2020-12-18T02:03:24+05:30

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలన్న డిమాండ్‌తో ఉద్యమిస్తున్న అమరావతి రైతులకు మద్దతుగా వాషింగ్టన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్ డీసీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలన్న డిమాండ్‌తో ఉద్యమిస్తున్న అమరావతి రైతులకు మద్దతుగా వాషింగ్టన్‌ డీసిలోని ఎన్నారైలు గళం విప్పారు. రైతుల పోరాటం ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలో ఎన్నారైలు ప్రదర్శన చేసి అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అమెరికా పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమా పాల్గొన్నారు. అక్కడి తెలుగువారితో కలిసి వాషింగ్టన్‌ డీసీలో అమరావతి డిమాండ్‌ను వినిపించారు. ఒకవైపు మంచు కురుస్తుండగా.. తెలుగువారందరూ కలిసి.. 'మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు' అంటూ తమ నినాదాలను హోరెత్తించారు. సతీష్‌ వేమన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పెద్దలతోపాటు పిల్లలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. 

Updated Date - 2020-12-18T02:03:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising