ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నో రెడ్ స్టేట్స్.. నో బ్లూ స్టేట్స్.. ఓన్లీ యునైటెడ్ స్టేట్స్: బైడెన్

ABN, First Publish Date - 2020-11-08T19:31:19+05:30

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ తొలిసారి దేశ ప్రజలను ఉద్దేశించి డెలావేర్‌లోని వాల్మింగ్టన్ నుంచి ప్రసంగించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విల్మింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ తొలిసారి దేశ ప్రజలను ఉద్దేశించి డెలావేర్‌లోని వాల్మింగ్టన్ నుంచి ప్రసంగించారు. తనకు సంపూర్ణ విజయాన్ని అందించిన అమెరికన్లకు ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. "నాకు రెడ్ స్టేట్స్.. బ్లూ స్టేట్స్.. అంటూ ప్రత్యేకంగా ఏమీ కనిపించడం లేదని.. ఓన్లీ యునైటెడ్ స్టేట్స్" అని అన్నారు. తనపై అమెరికన్లు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని తెలిపారు. మీరు వేసిన ఓట్ల వెనక మీ ఆశలు, ఆశయాలు ఉన్నాయన్న బైడెన్.. అమెరికన్ల భవిష్యత్ కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేస్తానన్నారు. తనకు మద్దతుగా నిలిచిన ఆఫ్రికన్-అమెరికన్లకు, మైనారిటీలకు కూడా ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్‌కు బైడెన్ శుభాకాంక్షలు  తెలియజేశారు.  

Updated Date - 2020-11-08T19:31:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising