ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రపంచ నాయకత్వానికి అమెరికా సిద్ధం: బైడెన్‌

ABN, First Publish Date - 2020-11-26T09:47:45+05:30

ప్రపంచానికి నాయకత్వం వహించేందుకు అమెరికా మరోసారి సిద్ధమైందని, మరోసారి అగ్రస్థానంలో ఆసీనమవబోతోందని ఆ దేశానికి 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ ప్రకటించారు. ఆయన గెలుపును జనరల్‌ సర్వీసెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ ధ్రువీకరించిన నేపథ్యంలో.. జాతీయభద్రత, విదేశాంగ విధానాలకు సంబంధించిన ఆరుగురు కీలక అధికారులను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌, నవంబరు 25: ప్రపంచానికి నాయకత్వం వహించేందుకు అమెరికా మరోసారి సిద్ధమైందని, మరోసారి అగ్రస్థానంలో ఆసీనమవబోతోందని ఆ దేశానికి 46వ  అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ ప్రకటించారు. ఆయన గెలుపును జనరల్‌ సర్వీసెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ ధ్రువీకరించిన నేపథ్యంలో.. జాతీయభద్రత, విదేశాంగ విధానాలకు సంబంధించిన ఆరుగురు కీలక అధికారులను ఆయన పరిచయం చేశారు. ట్రంప్‌ నినాదమైన ‘అమెరికా ఈజ్‌ ఫస్ట్‌ (అమెరికాకే ప్రాధాన్యం)’ అనే నినాదానికి భిన్నంగా తన ప్రభుత్వం ఉండబోతోందని బైడెన్‌ సంకేతాలిచ్చారు. అమెరికాలో అధికార మార్పిడి ప్రక్రియ జోరందుకుంది. మరోవైపు.. ట్రంప్‌ మాత్రం తన ఓటమిని అంత తేలిగ్గా ఒప్పుకోనని, విజయాన్ని బైడెన్‌కు ఇచ్చేసే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు. 


ఇక.. అమెరికా మిత్రుల్ని కూడగట్టుకుని, కూటములను పునరుద్ధరించుకుని, జాతీయ భద్రతను, విదేశాంగ విధానాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని కొత్త ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ అన్నారు. అంతకన్నా ముందు ఆంతరంగిక సమస్యలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, అధ్యక్ష పదవి నుంచి దిగిపోయాక ఆ జ్ఞాపకాలతో బరాక్‌ ఒబామా రాసిన ‘ఏ ప్రామిస్డ్‌ ల్యాండ్‌’ పుస్తకం అమ్మకాల్లో సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన తొలివారంలోనే ఆ పుస్తకం ఒక్క అమెరికాలోనే 17 లక్షల కాపీలు అమ్ముడైంది.


Updated Date - 2020-11-26T09:47:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising