ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కట్టడిలో ట్రంప్ విఫలం: జో బైడెన్

ABN, First Publish Date - 2020-10-31T02:30:22+05:30

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడింది. నవంబర్ 3న అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ వి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫ్లోరిడా: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడింది. నవంబర్ 3న అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా  అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయించే రాష్ట్రాలపై ఇరు పార్టీల అభ్యర్థులు దృష్టిపెట్టారు. ఈ క్రమంలో ప్లోరిడాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న జో బైడెన్.. కరోనా కట్టడిలో ట్రంప్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ట్రంప్ నిర్వహిస్తున్న ప్రచార ర్యాలీలకు జనం భారీ స్థాయిలో హాజరవుతున్నట్లు చెప్పిన ఆయన.. వారంతా కనీసం మాస్క్‌లు కూడా ధరించడం లేదన్నారు. అంతేకాకుండా ట్రంప్ నిర్వహిస్తున్న ప్రచార ర్యాలీలు.. కరోనా వైరస్ సూపర్ స్ప్రెడర్‌గా మారుతున్నయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 


ఇదిలా ఉంటే.. ఫ్లోరిడాలోని టంపాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీకి మెలానియా ట్రంప్‌తో కలసి హాజరైన ట్రంప్.. జో బైడెన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అమెరికా ఎన్నికల చరిత్రలో బైడెన్ లాంటి ‘చెత్త’ అభ్యర్థిని చూడలేదంటూ దూషించారు. ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ గెలుపొందితే.. అమెరికాను సోషలిస్ట్ దేశంగా మారుస్తారని ట్రంప్ ఆరోపించారు. కాగా.. అధికార లెక్కల ప్రకారం అమెరికాలో ఇప్పటికే 80 మిలియన్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 


Updated Date - 2020-10-31T02:30:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising