ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

8 కోట్లకు పైగా ఓట్లను సాధించిన మొదటి అధ్యక్షుడిగా బైడెన్ రికార్డు

ABN, First Publish Date - 2020-11-26T07:20:02+05:30

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ సరికొత్త చరిత్రను సృష్టించారు. అమెరికా చరిత్రలో ఏ ఒక్క అధ్యక్ష అభ్యర్థికి పోలవని ఓ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ సరికొత్త చరిత్రను సృష్టించారు. అమెరికా చరిత్రలో ఏ ఒక్క అధ్యక్ష అభ్యర్థికి పోలవని ఓట్లు జో బైడెన్‌కు పోలయ్యాయి. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌కు 8,00,11,000 ఓట్లు వచ్చాయి. 2016 ఎన్నికల వరకు చూస్తే.. అమెరికా చరిత్రలో ఏ ఒక్క అధ్యక్ష అభ్యర్థికి 7 కోట్ల ఓట్లు కూడా పోలవలేదు. అయితే జో బైడెన్ మాత్రం ఏకంగా 8 కోట్ల ఓట్లను దాటేసి సరికొత్త చరిత్రను సృష్టించారు. మరోపక్క రిపబ్లికన్ పార్టీ నుంచి బరిలో నిలిచిన ట్రంప్‌కు మొన్నటి ఎన్నికల్లో 7.38 కోట్ల ఓట్లు పోలయ్యాయి. జో బైడెన్ తరువాతి స్థానంలో అత్యధిక ఓట్లు పొందిన నాయకుడిగా ట్రంప్ నిలిచారు. 


కాగా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌ మొత్తం 306 ఎలక్టోరల్ ఓట్లను గెలుపొందగా.. ట్రంప్ కేవలం 232 ఎలక్టోరల్ ఓట్లను మాత్రమే సాధించారు. మ్యాజిక్ ఫిగర్(270)ను జో బైడెన్ దాటేయడంతో అమెరికా 46వ అధ్యక్షుడిగా వచ్చే ఏడాది జనవరి 20న ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. అమెరికా ఎన్నికల్లో మోసం జరిగిందంటూ ఇప్పటివరకు ఆరోపణలు చేస్తూ వచ్చిన ట్రంప్ తాజాగా తన ఓటమిని అంగీకరించారు. తాజాగా అధికార బదిలీకి తన ఆమోద్రముద్ర వేశారు.

Updated Date - 2020-11-26T07:20:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising