ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధ్యక్ష రేస్ నుంచి తప్పుకున్న బెర్నీ శాండర్స్

ABN, First Publish Date - 2020-04-09T03:53:35+05:30

అమెరికా అధ్యక్ష పదవికి సంబంధించిన ప్రచారాన్ని నిలిపివేస్తున్నట్టు సెనేటర్ బెర్నీ శాండర్స్(78) బుధవారం ప్రకటించారు. డెమొక్రటిక్ పార్టీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి రేస్ నుంచి తప్పుకుంటున్నట్టు సెనేటర్, డెమొక్రటిక్ అభ్యర్థి బెర్నీ శాండర్స్(78) బుధవారం ప్రకటించారు. జో బిడెన్ డెమొక్రటిక్ అభ్యర్థిగా నామినేషన్ వేసే అవకాశం ఉన్నట్టు ఆయన తెలిపారు. జో బిడెన్‌‌ను అభినందిస్తూ.. భవిష్యత్తులో ఆయనతో కలిసి పనిచేస్తానని అన్నారు. బెర్నీ శాండర్స్ తప్పుకోవడంతో రిపబ్లికన్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వచ్చే ఎన్నికల్లో జో బిడెన్‌ తలపడనున్నారు. 


బుధవారం బెర్నీ శాండర్స్ ఆయన మద్దతుదారులతో మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు నాకు మద్దతుగా నిలిచిన, నా కోసం పనిచేసిన కార్యకర్తలందరికి  ధన్యవాదాలు. ప్రచారం కోసం ఆర్థికంగా సాయం చేసిన 20 లక్షల మంది అమెరికన్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నా’ అని అన్నారు. కాగా.. 2016 అధ్యక్ష పదవి ఎన్నికల్లో కూడా బెర్నీ శాండర్స్ డెమొక్రటిక్ పార్టీ నుంచి నామివేషన్ వేసేందుకు హిల్లరీ క్లింటన్‌తో పోరాడారు. ఇదిలా ఉండగా.. నవంబర్ మూడో తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కరోనా మహమ్మారి అమెరికాను పట్టి పీడిస్తోంది. ఈ నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికలు కూడా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Updated Date - 2020-04-09T03:53:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising