ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజింగ్‌లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు: హెల్త్ కమిషన్

ABN, First Publish Date - 2020-07-07T23:06:43+05:30

చైనా రాజధాని బీజింగ్‌‌లో గడిచిన 24 గంటల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్: చైనా రాజధాని బీజింగ్‌‌లో గడిచిన 24 గంటల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని అక్కడి హెల్త్ కమిషన్ వెల్లడించింది. ఇటీవల బీజింగ్‌ను కరోనా మహమ్మారి మరోమారు కుదిపేసిన విషయం తెలిసిందే. జూన్ 11న ఓ హోల్‌సేల్ ఫుడ్ మార్కెట్‌లో కొత్తగా కేసులు బయటపడటంతో ప్రభుత్వం బీజింగ్‌లో మరోమారు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను విధించింది. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది. అంతేకాకుండా ప్రారంభమైన స్కూళ్లను సైతం మూసివేయించింది. బీజింగ్‌లోని 90 శాతం ప్రజలకు ఈ ఫుడ్ మార్కెట్ నుంచే కూరగాయలు, పండ్లు వెళ్తాయి. దీంతో అధికారులు వెంటనే అప్రమత్యమయ్యారు. కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్లారు. రెండో క్లస్టర్‌లో భాగంగా మొత్తంగా ఈ ప్రాంతంలో 335 కేసులు బయటపడినట్టు హెల్త్ కమిషన్ తెలిపింది. ఇందులో 15 మంది పూర్తిగా కోలుకోగా.. 320 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. లక్షణాలు లేని 31 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. కాగా.. చైనా వ్యాప్తంగా చూసుకుంటే మంగళవారం ఎనిమిది కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 83,565కు చేరింది. మరోపక్క చైనాలో ఇప్పటివరకు 78,528 మంది పూర్తిగా కోలుకోగా.. 4,634 మంది మరణించారు.

Updated Date - 2020-07-07T23:06:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising