ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజిట్ వీసాల గడువు పెంచిన బహ్రెయిన్ !

ABN, First Publish Date - 2020-10-18T12:25:59+05:30

గల్ఫ్ దేశమైన బహ్రెయిన్ విజిట్ వీసాలపై తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బహ్రెయిన్: గల్ఫ్ దేశమైన బహ్రెయిన్ విజిట్ వీసాలపై తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అన్నీ రకాల విజిట్ వీసాల గడువును 2021, జనవరి 21 వరకు పొడిగించింది. ఈ మేరకు బహ్రెయిన్ నేషనాలిటీ, పాస్‌పోర్ట్స్ అండ్ రెసిడెన్స్ అఫైర్స్(ఎన్‌పీఆర్‌ఏ) శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. సందర్శకులందరికీ ఎలాంటి రుసుము చెల్లించకుండానే ఈ పెంచిన గడువు వర్తిస్తుందని ఎన్‌పీఆర్‌ఏ పేర్కొంది. అలాగే ఈ పొడిగింపు కోసం ప్రత్యేకంగా ఈ-వీసా వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, ఆటోమెటిక్‌గా ఎన్‌పీఆర్‌ఏనే అందరికీ దీనిని వర్తింపు చేస్తుందని తెలియజేసింది. కరోనా వల్ల విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రవాసులకు ఇది ఉపయోగపడుతుందని తెలిపింది. ఈ సేవ సందర్శకులను దేశంలో వారి నివాస పరిస్థితులను సరిదిద్దుకోవడానికి మంచి అవకాశం అని పేర్కొంది. కరోనావైరస్ వ్యాప్తికి వ్యతిరేకంగా జాతీయ ప్రయత్నాల్లో భాగంగా మానవతదృక్పథంతో అడ్మినిస్ట్రేషన్ ఫీజు చెల్లించకుండా బహ్రెయిన్‌లోని విదేశీయులకు రెసిడెన్సీ అనుమతులు, వీసాల గడువును పెంచడం ద్వారా మహమ్మారి ప్రారంభం నుండి సందర్శకులు, నివాసితులకు ఎన్‌పీఆర్‌ఏ సౌకర్యాలు కల్పించింది.    

Updated Date - 2020-10-18T12:25:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising