ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనసమూహాలపై బ‌హ్రెయిన్ ఆంక్ష‌లు.. ఉల్లంఘిస్తే మూడేళ్ల‌ జైలు

ABN, First Publish Date - 2020-03-27T18:45:41+05:30

క‌రోనావైర‌స్ విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే గ‌ల్ఫ్ దేశాలు ఆంక్ష‌లు విధించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ‌హ్రెయిన్: క‌రోనావైర‌స్ విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే గ‌ల్ఫ్ దేశాలు ఆంక్ష‌లు విధించాయి. ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తి, నియంత్ర‌ణ‌కు క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టాయి. తాజాగా బ‌హ్రెయిన్ కూడా జనసమూహాలపై ఆంక్ష‌లు విధించింది. రోడ్లు, బీచ్‌లు, పార్కులు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురికి మించి క‌నిపించ‌కూడ‌దని ఆంక్ష‌లు విధించింది. ఒక‌వేళ ఈ ఆంక్ష‌లను ఉల్లంఘిస్తే మూడేళ్ల‌ జైలు (లేదా) 5వేల‌ బహ్రెయిన్ దినార్(రూ. 9, 91,410) జ‌రిమానా (లేదా) రెండు విధించే అవ‌కాశం కూడా ఉంద‌ని క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీం కమాండర్, అంతర్గత మంత్రి జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా తెలిపారు. 


వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి సమావేశ నిషేధ చర్యలను పాటించాల‌ని దేశ పౌరులు, నివాసితులకు అంతర్గత వ్యవహారాల శాఖ పిలుపునిచ్చింది. ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించింది. కాగా, బ‌హ్రెయిన్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 458 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, న‌లుగురు చనిపోయారు. 204 మంది కోలుకున్నారు.

Updated Date - 2020-03-27T18:45:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising