ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కాటుకు.. నెలల చిన్నారి మృతి!

ABN, First Publish Date - 2020-03-30T00:41:01+05:30

కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికాపై కూడా కొవిడ్-19 ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో ఇప్పటి వరకు 1.23లక్షల మంది కరోనా బారినపడ్డారు. ఒక్క అమెరికాలో తప్ప.. ఇతర ఏ దేశంలో కూడా ఇంత పెద్ద సంఖ్యలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికాపై కూడా కొవిడ్-19 ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో ఇప్పటి వరకు 1.23లక్షల మంది కరోనా బారినపడ్డారు.  ఒక్క అమెరికాలో తప్ప.. ఇతర ఏ దేశంలో కూడా ఇంత పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు రెండు వేల మంది వైరస్ సోకి మరణించారు. ఇదిలా ఉంటే.. అమెరికాలో ఈ రోజు కరోనా కాటుకు నెలల పసికందు ప్రాణాలు కోల్పోయింది. చికాగోకు చెందిన చిన్నారి కరోనా బారినపడింది. కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందినట్లు ఇల్లినాయిస్‌ రాష్ట్ర ప్రజా ఆరోగ్య శాఖ డైరెక్టర్ తెలిపారు. అంతేకాకుండా కొవిడ్-19 బారినపడి ఇప్పటి వరకు వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు మరణించినట్లు తెలిపిన అధికారులు.. పసివాళ్లు మరణించడం ఇదే ప్రథమం అని పేర్కొన్నారు. ఇది ఒక హెచ్చరికలాంటిదన్న అధికారులు.. ప్రభుత్వ ఆదేశాలను సీరియస్‌గా తీసుకోకుంటే పరిస్థితి చేయిదాటి పోతుందని ప్రజలకు సూచించారు. కాగా.. పసికందుతో సహా ఇల్లినాయిస్‌లో ఈ రోజు మొత్తం 13 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు అక్కడ మరణించిన వారి సంఖ్య 47కు చేరింది. ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19 కారణంగా మరణించిన వారి సంఖ్య 31వేలకు చేరింది.


Updated Date - 2020-03-30T00:41:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising