ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి

ABN, First Publish Date - 2020-08-05T23:47:11+05:30

ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రం కరోనా కేసుల్లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రం కరోనా కేసుల్లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో విక్టోరియా రాష్ట్రంలో భారీగా 725 కరోనా కేసులు బయటపడ్డాయి. ఇప్పటివరకు ఒకేరోజు ఇన్ని కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. మొత్తం 725 కేసుల్లో 164 కేసులకు లింక్ దొరికిందని.. మిగతా 561 మందికి వైరస్ ఎవరి నుంచి సోకిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. మరోపక్క గడిచిన 24 గంటల్లో విక్టోరియా రాష్ట్రంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ 15 మృతుల్లో 12 మంది వృద్దాశ్రమాలకు చెందిన వారేనని అధికారులు తెలిపారు. ఇక విక్టోరియా రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారిపై కొత్తగా ఆంక్షలను విధిస్తున్నారు. విక్టోరియా నుంచి న్యూ సౌత్ వేల్స్ వచ్చే వారు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని అక్కడి అధికారులు స్పష్టం చేశారు. శుక్రవారం నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయన్నారు. న్యూ సౌత్ వేల్స్‌తో పాటు ఇతర రాష్ట్రాలు కూడా ఇదే విధంగా నిబంధనలు అమలు చేసేందుకు సిద్దమవుతున్నాయి. కాగా.. ఆస్ట్రేలియాలో కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 19,444కు చేరింది. ఇక ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు 247 మంది కరోనా బారిన పడి మృత్యువాతపడ్డారు. 

Updated Date - 2020-08-05T23:47:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising