ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కట్టడికి ఆస్ట్రేలియా కీలక నిర్ణయం.. 100 సంవత్సరాల తర్వాత!

ABN, First Publish Date - 2020-07-06T19:31:09+05:30

కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విక్టోరియా రాజధాని మెల్‌బోర్న్‌లో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిడ్నీ: కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విక్టోరియా రాజధాని మెల్‌బోర్న్‌లో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో సుమారు వంద సంవత్సరాల తర్వాత న్యూ సౌత్ వేల్స్, విక్టోరియా రాష్ట్రాల మధ్య మంగళవారం నుంచి సరిహద్దులు మూసేస్తున్నట్లు విక్టోరియా ప్రీమియర్ డేనియల్ ఆండ్రూస్ ప్రకటించారు. మెల్‌బోర్న్‌లో సోమవారం రోజు 127 కరోనా కేసులు నమోదవ్వగా.. మహమ్మారి కారణంగా ఒకరు మరణించారు. గత రెండు వారాల నుంచి ఆస్ట్రేలియాలో ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు. సోమవారం రోజు నమోదైన కరోనా మరణంతో.. ఇప్పటి వరకు ఆస్ట్రేలియాలో కొవిడ్-19 కారణంగా మరణించిన వారి సంఖ్య 105కు చేరింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య మంగళవారం నుంచి సరిహద్దులను మూసేయనున్నట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది. కాగా.. 1919లో స్పానిష్ ఫ్లూ కారణంగా మొదటిసారి న్యూసౌత్ వేల్స్, విక్టోరియా రాష్ట్రాల మధ్య సరిహద్దులను మూసేశారు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు 8వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 


Updated Date - 2020-07-06T19:31:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising