ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేను ట్రంప్ చెప్పిన దాంతో విభేదిస్తున్నాను: ఫౌచీ

ABN, First Publish Date - 2020-09-13T01:43:06+05:30

మొదట్లో మహమ్మారి కరోనాను తేలికగా తీసుకున్నట్లు అంగీకరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఈ వైరస్‌ను త్వరలోనే అదుపులోకి తీసుకువస్తామని నమ్ముతున్నట్లు చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్ డీసీ: మొదట్లో మహమ్మారి కరోనాను తేలికగా తీసుకున్నట్లు అంగీకరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఈ వైరస్‌ను త్వరలోనే అదుపులోకి తీసుకువస్తామని నమ్ముతున్నట్లు చెప్పారు. అయితే, తాజాగా ట్రంప్ వ్యాఖ్యలపై యూఎస్ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌచీ స్పందించారు. "నేను ట్రంప్ చెప్పిన దాంతో విభేదిస్తున్నాను. దేశంలో ప్రస్తుతం నమోదవుతున్న కొవిడ్ గణంకాలు కలవరపెడుతున్నాయి" అని అన్నారు. ట్రంప్ చెప్పినట్లు వైరస్‌ను అదుపులోకి తీసుకురావడం అంత సులువు కాదని పేర్కొన్నారు.


అంతేగాక శీతకాలం కంటే ముందే ఈ మహమ్మారిని అదుపులోకి తీసుకురావాలని ఆయన కోరారు. లేకుంటే పరిస్థితులు మరింత చేయిజారీపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా దేశంలో కొవిడ్ విజృంభణ కొనసాగుతుందని చెప్పిన ఫౌచీ... ఇప్పటికీ ఇక్కడ డైలీ దాదాపు 40వేల పాజిటివ్ కేసులు, 1000కి పైగా మరణాలు నమోదవుతున్న విషయాన్ని గుర్తు చేశారు. కాగా, అమెరికాను అల్లాడిస్తున్న కరోనా ఇప్పటివరకు 66.41 లక్షల మందికి సోకగా... 1.97 లక్షల మందిని బలిగొంది.    

Updated Date - 2020-09-13T01:43:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising