ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుదేలు దిశగా అమెరికా.. 4.7 కోట్ల ఉద్యోగాలకు ఎసరు

ABN, First Publish Date - 2020-04-01T02:47:50+05:30

ఓవైపు కోవిడ్-19తో కల్లోలంగా మారిన అమెరికాకు మరో భారీ దెబ్బ తగలబోతోందా? అవుననే అంటున్నాయి తాజా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్: ఓవైపు కోవిడ్-19తో కల్లోలంగా మారిన అమెరికాకు మరో భారీ దెబ్బ తగలబోతోందా? అవుననే అంటున్నాయి తాజా అధ్యయనాలు. కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రెండో త్రైమాసికంలో నిరుద్యోగం 32.1 శాతానికి పెరిగే అవకాశం ఉందని ఫెడరల్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ సెయింట్ లూయిస్ అంచనా వేసింది. ఫలితంగా 4.7 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉందని పేర్కొంది. దేశంలో నిరుద్యోగస్థాయి ఇలా పడిపోవడం 1948 తర్వాత ఇదే తొలిసారి కానుందని తెలిపింది. 


అమెరికాలోని పలు రాష్ట్రాల్లో షట్‌డౌన్ కారణంగా ఇప్పటికే లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోగా, 33 లక్షలమంది నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకోవడం అక్కడి దారుణ పరిస్థితికి అద్దం పడుతోంది. ఉద్యోగాలు కోల్పోయే వారిలో సేల్స్, ప్రొడక్షన్, ఆహార ఉత్పత్తులు, సేవల విభాగాలకు చెందిన ఉద్యోగులు ఉండే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫ్లైట్ అటెండెంట్లు, రెస్టారెంట్ సర్వర్లు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

Updated Date - 2020-04-01T02:47:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising