ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసులు 17 లక్షలకు చేరువైనా.. ఏ మాత్రం భయపడకుండా తిరుగుతున్న అమెరికన్లు

ABN, First Publish Date - 2020-05-25T23:24:01+05:30

కరోనాకు అమెరికా కేంద్రంగా ఉన్న విషయం తెలిసిందే. ప్రపంచంలో ఏ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్: కరోనాకు అమెరికా కేంద్రంగా ఉన్న విషయం తెలిసిందే. ప్రపంచంలో ఏ ఒక్క దేశంలో నమోదు కాని కేసులు ఒక్క అమెరికాలోనే నమోదయ్యాయి. అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకు 16,86,436 కేసులు నమోదుకాగా.. కరోనా బారిన పడి 99,300 మంది మరణించారు. ఇదిలా ఉంటే.. అమెరికన్లు మాత్రం కరోనాను అసలు ఏ మాత్రం సీరియస్‌గా తీసుకోవడం లేదు. అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలను ఎత్తివేయడంతో ప్రజలు మాస్క్‌లు లేకుండానే తిరిగేస్తున్నారు. వీకెండ్ కావడంతో ఫ్లోరిడా, మేరీలాండ్, జార్జియా, వర్జీనియా, ఇండియానాలలో ప్రజలు కనీసం భౌతిక దూరం కూడా పాటించకుండా తిరుగుతున్నారు. అర్కన్సాస్‌లో ఇటీవల పూల్ పార్టీ కారణంగా కరోనా కేసులు అమాంతం పెరిగాయి. ఈ ఘటనను చూసైనా భయపడతారు అనుకుంటే.. మిస్సౌరీలో తాజాగా వందలాది మంది కనీసం ఫేస్ మాస్క్‌ కూడా లేకుండా పూల్ పార్టీలో పాల్గొన్నారు. ప్రజలు ఈ రోజు ఎలా ప్రవర్తించారో చెప్పండి.. మూడు రోజుల తరువాత కేసులు ఎలా ఉంటాయో చెబుతా అంటూ ఇటీవల న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో అన్నారు. ప్రజల ప్రవర్తన బట్టే కరోనా కేసుల సంఖ్య ఆధారపడి ఉంటుందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ప్రజలు ఇలానే తిరుగుతూ ఉంటే.. కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కరోనాను ప్రభుత్వం నియంత్రించలేదన్న విషయం ప్రతిఒక్కరు గుర్తుపెట్టుకోవాలని అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2020-05-25T23:24:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising