ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ఎఫెక్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న విమానయాన సంస్థలు!

ABN, First Publish Date - 2020-10-02T06:34:05+05:30

అమెరికాకు చెందిన అమెరికన్, యునైటెడ్ విమానయాన సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కొవిడ్ నేపథ్యంలో ఏర్పడ్డ నష్టాలను పూడ్చుకోవడానికి ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమయ్యా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికాకు చెందిన అమెరికన్, యునైటెడ్ విమానయాన సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కొవిడ్ నేపథ్యంలో ఏర్పడ్డ నష్టాలను పూడ్చుకోవడానికి ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమయ్యాయి. వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్ కారణంగా అమెరికన్ ఎయిర్‌లైన్స్.. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో దాదాపు 5బిలియన్ డాలర్లను నష్టపోయింది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్.. సుమారు 3.3 బిలియన్ డాలర్లను నష్టపోయింది. ఈ క్రమంలో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించాలని.. ప్రభుత్వాన్ని కోరాయి. ఈ సంస్థలు చేసిన వినతిని చట్టసభల సభ్యులు తోసిపుచ్చారు. దీంతో నష్టాలను పూడ్చుకోవడానికి ఉద్యోగాలను తొలగించాలనే నిర్ణయానికి వచ్చాయి. కాగా.. అమెరికా, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల.. సుమారు 32వేల మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. 


Updated Date - 2020-10-02T06:34:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising