ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సరస్సులోకి దూకిన నటి.. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం

ABN, First Publish Date - 2020-07-10T02:58:25+05:30

అమెరికాకు చెందిన నయా రివేరా అనే నటి బోటు నుంచి ఒక్కసారిగా అదృశ్యమవడంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాస్ ఏంజెల్స్: అమెరికాకు చెందిన నయా రివేరా అనే నటి బోటు నుంచి ఒక్కసారిగా అదృశ్యమవడంతో ఆమె కోసం అధికారులు గాలింపు చర్యలను సాగిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రివేరా బుధవారం సాయంత్రం లాస్ ఏంజెల్స్‌లోని లేక్ పెరు వద్ద ఓ బోట్‌ను అద్దెకు తీసుకుంది. నాలుగేళ్ల కొడుకుతో కలిసి బోట్‌లో ప్రయాణించింది. అయితే మూడు గంటల తర్వాత బోటు నీళ్లపై తేలుతూ ఉండటం, లోపల ఎవరూ లేకపోవడాన్ని స్థానికులు గమనించారు. వెంటనే స్థానికులు బోటు ఎక్కి చూడగా.. నాలుగేళ్ల పిల్లోడు తప్ప మరెవరూ కనిపించలేదు. పిల్లోడిని రక్షించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. విషయం పోలీసుల వరకు వెళ్లడంతో.. ఆ బోటు నటి రివేరా అద్దెకు తీసుకున్నట్టు.. ఆమె అదృశ్యమైనట్టు వెలుగులోకి వచ్చింది. వెంటనే అధికారులు రెస్క్యూ టీంను రంగంలోకి దింపి రివేరా కోసం సరస్సు మొత్తాన్ని వెతికిస్తున్నారు. 


ఇదిలా ఉండగా.. తన తల్లి బోట్ నుంచి నీళ్లలోకి దూకిందని.. తిరిగి మళ్లీ రాలేదని రివేరా కొడుకు పోలీసులతో చెప్పినట్టు సమాచారం. బోటులో రివేరా కొడుకు లైఫ్ జాకెట్ వేసుకుని ఉండగా.. రివేరా లైఫ్ జాకెట్ మాత్రం బోట్‌లోనే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మరోపక్క కార్ కూడా ఒడ్డునే పార్క్ చేసి ఉందని.. ఆమె బయటకు అయితే వచ్చి ఉండదని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే. ఈ ఘటన జరిగిన ముందు రోజు రివేరా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో తన కొడుకుతో ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది. అంతేకాకుండా ‘కేవలం మేమిద్దరమే’ అని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చింది. దీంతో రివేరా ఆత్మహత్య చేసుకుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. కాగా.. రివేరా ప్రాణాలతో సురక్షితంగా ఉండాలని ఆమె అభిమానులు, తోటి నటులు ప్రార్థిస్తున్నారు. 

Updated Date - 2020-07-10T02:58:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising