ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళకు వింత అనుభవం.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటో!

ABN, First Publish Date - 2020-08-13T21:20:53+05:30

అమెరికాలో ఓ మహిళకు వింత అనుభవం ఎదురైంది. తన డ్రైవింగ్ లైసెన్స్‌పై ఉన్న ఫొటోను చూసి.. ఆశ్చర్యపోయింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికాలో ఓ మహిళకు వింత అనుభవం ఎదురైంది. తన డ్రైవింగ్ లైసెన్స్‌పై ఉన్న ఫొటోను చూసి.. ఆశ్చర్యపోయింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని టెనేస్సీ రాష్ట్రానికి చెందిన జాడే డాడ్.. డ్రైవింగ్ లైసెన్స్ గడువు కొద్ది రోజుల క్రితం ముగిసిపోయింది. దీంతో ఆమె.. తన లైసెన్స్‌ను రెన్యువల్ కోసం సంబంధించిన అధికారులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు సరిగ్గా వారం తర్వాత.. జాడే డాడ్‌కు డ్రైవింగ్ లైసెన్స్‌ను పోస్ట్ ద్వారా పంపించారు. కాగా.. తన డ్రైవింగ్ లైసెన్స్‌ను చూసిన జాడే డాడ్.. ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. లైసెన్స్‌పై ఆమె ఫొటో స్థానంలో ఖాళీ కుర్చీ ఫొటోను చూసి ఆమె కంగుతిన్నారు. ఈ విషయాన్ని వెంటనే ఆమె.. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే అధికారులు మాత్రం ఆమె చెప్పిన విషయాన్ని మొదటగా నమ్మలేదు.  అనంతరం.. లైసెన్స్ కార్డును చూసి.. వాళ్లు కూడా షాక్ అయ్యారు. అంతేకాకుండా లైసెన్స్‌ను సరిచేసి ఇస్తామంటూ జాడే డాడ్‌కు హామీ ఇచ్చారు. కాగా.. తనకు ఎదురైన వింత అనుభవాన్ని జాడే డాడ్.. సోషల్ మీడియా ద్వారా నెటిజన్లతో పంచుకున్నారు. దీంతో ప్రస్తుతం ఆ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. 


Updated Date - 2020-08-13T21:20:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising