ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భౌతిక దూరం ఉండేలా.. మేరీల్యాండ్‌లోని ఈ రెస్టారెంట్ ఏం చేసిందంటే..

ABN, First Publish Date - 2020-05-20T03:37:12+05:30

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. ముఖ్యంగా అమెరికాలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓషన్ సిటి: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. ముఖ్యంగా అమెరికాలో ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే.. అమెరికాలోని అనేక రాష్ట్రాలు అక్కడక్కడ సడలింపులిస్తూ వెళ్తున్నాయి. మేరీల్యాండ్ రాష్ట్రం కూడా గత శుక్రవారం నుంచి కొన్ని సడలింపులిచ్చింది. రాష్ట్రంలోని కొన్ని టౌన్లలో రెస్టారెంట్లు తెరిచేందుకు అనుమతిచ్చింది. భౌతిక దూరం తప్పక పాటించాలని, మాస్క్‌లు కూడా ధరించాలని సూచించింది. ఇదే సమయంలో ఓషన్ సిటి టౌన్‌లోని ఫిష్ టేల్స్ బార్ అండ్ గ్రిల్ వినూత్న ఐడియాతో ముందుకొచ్చింది. కస్టమర్లు భౌతిక దూరం పాటించేలా బంపర్ టేబుల్స్‌ను తయారుచేసింది. పైనున్న ఫొటోను గమనిస్తే.. ఈ బంపర్ టేబుల్ వల్ల ఇద్దరి మధ్య కనీసం మీటరు నుంచి రెండు మీటర్ల దూరం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ టేబుల్‌కు వీల్స్ ఉండటంతో ఎటువైపుకైనా తీసుకెళ్లచ్చు. భౌతిక దూరంతో పాటు ఈ ఐడియా సరదాగా కూడా ఉంటుందని రెస్టారెంట్ యాజమాన్యం చెబుతోంది.

Updated Date - 2020-05-20T03:37:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising