ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాలు కావాలంటూ అర్థరాత్రి 2 గంటలకు 911కు ఫోన్..

ABN, First Publish Date - 2020-02-18T02:31:36+05:30

ఆపదలో ఉన్నప్పుడే కాదు.. అవసరం ఉన్నప్పుడు కూడా ఆదుకుంటామని అమెరికా పోలీసులు నిరూపించారు. వివరాల్లోకి వెళ్తే.. యూటా రాష్ట్రానికి చెందిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూటా: ఆపదలో ఉన్నప్పుడే కాదు.. అవసరం ఉన్నప్పుడు కూడా ఆదుకుంటామని అమెరికా పోలీసులు నిరూపించారు. వివరాల్లోకి వెళ్తే.. యూటా రాష్ట్రానికి చెందిన షనన్ బర్డ్ అనే మహిళ అర్థరాత్రి 2 గంటల ప్రాంతంలో 911కు ఫోన్ చేసింది. అమెరికాలో 911కు ఫోన్ చేసి ఆపదలో ఉన్నామని చెబితే.. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుంటారు. అయితే మహిళ అర్థరాత్రి రెండు గంటలకు ఫోన్ చేసి.. తన బిడ్డకు పాలు లేవని ఆకలితో ఏడుస్తోందని చెప్పుకొచ్చింది.


కూతురికి పాలు పట్టడానికి తన దగ్గర పాలు లేవని.. బయటకు వెళ్లి తీసుకురావడానికి తన భర్త కూడా ఇంట్లో లేడని తెలిపింది. మిగతా పిల్లలందరూ ఇంట్లో నిద్రపోతున్నారని.. తన కూతురుకు పాలు కావాలని చెప్పింది. మహిళ ఆవేదనను అర్థం చేసుకున్న లోన్ పీక్ ప్రాంతం పోలీసులు వెంటనే పాలు, బేబీ ఫార్ములాను తీసుకొచ్చి మహిళకు అందజేశారు. ఈ వార్త గురించి తెలిసిన వారంతా పోలీసులను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అదే విధంగా అర్థరాత్రి కూతురి కోసం పోలీసులకు ఫోన్ చేయడం మహిళ చేసిన మంచి పనంటూ నెటిజన్లు మహిళను కొనియాడుతున్నారు.

Updated Date - 2020-02-18T02:31:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising