ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా అనేదే లేదన్న అమెరికన్.. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందంటే..

ABN, First Publish Date - 2020-05-19T23:37:12+05:30

కరోనా అనేదే లేదని.. అది కేవలం ప్రభుత్వం ఆడుతున్న నాటకమన్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జుపిటర్: కరోనా అనేదే లేదని.. అది కేవలం ప్రభుత్వం ఆడుతున్న నాటకమన్న అమెరికన్ కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఫ్లోరిడాలోని జుపిటర్ టౌన్‌కు చెందిన బ్రైన్ హిచెన్స్ కరోనాను లైట్‌గా తీసుకుని కనీసం మాస్క్ కూడా పెట్టుకోకుండా తిరుగుతూ వచ్చాడు. ఐదు వారాల క్రితం బ్రైన్, అతడి భార్య అనారోగ్యానికి గురయ్యారు. ఆసుపత్రిలో పరీక్షలు చేయగా.. ఇద్దరికి కరోనా సోకినట్టు తేలింది. బ్రైన్ ఆరోగ్యం కొంచెం కుదుటపడినప్పటికి.. అతడి భార్య మాత్రం వెంటిలేటర్‌పైనే చికిత్స పొందుతోంది. ఆమె బతకడం కష్టమని బ్రైన్ ఒక నిర్ణయానికి కూడా వచ్చేశాడు. తనకు, భార్యకు కరోనా సోకితే కాని బ్రైన్‌కు వాస్తవ పరిస్థితి అర్థం కాలేదు. తాను ఎంతో పెద్ద తప్పు చేశానని.. మాస్క్ పెట్టుకుని భౌతిక దూరం పాటిస్తూ వచ్చి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదని బ్రైన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కనీసం తన భార్యను చూసేందుకు కూడా అనుమతి లేకుండా పోయిందని కన్నీటి పర్యంతమయ్యాడు. కరోనా వైరస్‌ను ప్రజలు తేలికగా తీసుకోకూడదని.. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని బ్రైన్ హెచ్చరిస్తున్నాడు. కాగా.. బ్రైన్, అతడి భార్య ఒకే ఆసుపత్రిలో వివిధ రూమ్‌లలో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2020-05-19T23:37:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising