ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంతి కోసం రిస్క్ చేసిన యువకుడు!

ABN, First Publish Date - 2020-12-16T00:26:18+05:30

మొసలి.. ఈ పేరు వింటేనే చాలా మందికి ఒళ్లు జలదరిస్తుంది. అటువంటి మొసలి సమీస్తే.. ఎవ్వరైనా అ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: మొసలి.. ఈ పేరు వింటేనే చాలా మందికి ఒళ్లు జలదరిస్తుంది. అటువంటి మొసలి సమీస్తే.. ఎవ్వరైనా అక్కడి నుంచి పరుగులు తీయాల్సిందే. అయితే ఓ యువకుడు మాత్రం ధైర్యం చేసి మొసలి దగ్గరకు వెళ్లాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాకు చెందిన కైల్ డౌనెస్ అతని సోదరుడితో కలిసి కేప్ కోరల్‌లో సరదాగా గోల్ఫ్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో కైల్ డౌనెస్ సోదరుడు బాల్‌ను బలంగా బాదడంతో అది కాస్తా.. నీటిలోంచి ఒడ్డుకు వచ్చిన మొసలి తోకపై పడింది. అయితే మొసలి దగ్గర పడిన బంతిని వదిలేయకుండా.. దాన్ని ఎలాగైనా తెచ్చుకోవాలని కైల్ డౌనెస్ నిర్ణయించకున్నాడు. ఈ క్రమంలో ధైర్యం చేసుకుని మెల్లిగా మొసలి దగ్గరకు వెళ్లాడు. అనంతరం తోకపై ఉన్న బంతిని చేతులోకి తీసుకుని పరుగు పెట్టాడు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అలజడి కావడంతో మొసలి కూడా భయభ్రాంతులకు గురై నీటిలోకి జారుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపట్ల స్పందిస్తున్న నెటిజన్లు.. బంతి కోసం అంత రిస్క్ చేయడం అవసరమా అంటూ కామెంట్ చేస్తున్నారు. 


Updated Date - 2020-12-16T00:26:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising